వెయిట్ లిఫ్టింగ్‌లో మెరిసిన నీలగిరి తేజం…మొదటి చాంఫియన్‌గా నల్లగొండ తేజస్వినిగౌడ్
తెలంగాణ జిల్లాల అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో ప్రధమ బహుయతి (ఛాంపియన్ షిప్) సాధించింది. ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఆ పోటీల్లో తేజస్విని అత్యుత్తమ ప్రతిభతో తొలి ఛాంపియన్ షిప్ సాధించి ఔరా అనిపించుకుంది.
నేటి అమ్మాయిలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎంచుకున్న క్రీడల్లో నిత్యం సాధనతో పోటీల్లో పాల్గొని బహుమతులు, పతకాలు సాధిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
నల్లగొండ పట్టణానికి చెందిన కందుల వెంకటర మణ గౌడ్, భార్గవి దంపతుల కుమార్తె కందుల తేజస్విని గౌడ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో అదరగొడుతోంది. ఒకవైపు ఐఏఎస్ అకాడమీలో చదువుతూ కొంటూనే మరోవైపు క్రీడల్లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ యువతి తాజాగా హైదరాబాదులో జరిగిన తెలంగాణ జిల్లాల అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో ప్రధమ బహుయతి (ఛాంపియన్ షిప్) సాధించింది. ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఆ పోటీల్లో తేజస్విని అత్యుత్తమ ప్రతిభతో తొలి ఛాంపియన్ షిప్ సాధించి ఔరా అనిపించుకుంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించాలానే పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది.
భవిష్యత్తులో ఒలంపిక్స్ లో దేశానికి పతకం సాధించడమే ధ్యేయమని తేజస్విని చెబుతోంది. రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ సాధించిన తేజస్విని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..