AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు..

అలాగే, కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌కు భారీ ఊరేగింపుతో పూజలు నిర్వహించిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. అతడు రూ. 20వేలు డౌన్‌పేమెంట్‌ చెల్లించి రూ.90వేల విలువైన మోపేడ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఊరంతా చెప్పుకునేలా గొప్పగా

Watch: రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు..
Man Purchase Moped
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2024 | 10:16 AM

Share

దసరా సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. పండగ పూట వాటికి పూజలు జరిపించుకుని వాడుతుంటారు. అలాగే, కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌కు భారీ ఊరేగింపుతో పూజలు నిర్వహించిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. అతడు రూ. 20వేలు డౌన్‌పేమెంట్‌ చెల్లించి రూ.90వేల విలువైన మోపేడ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఊరంతా చెప్పుకునేలా గొప్పగా సంబరాలు జరుపుకున్నాడు. కానీ, అంతలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.. ఆ వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు.. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో టీ స్టాల్‌ నడుపుతున్న ఓ వ్యక్తి మొపెడ్ కొనుగోలు చేశాడు..బండి ఖరీదు రూ. 90,000 కాగా, అతడు బ్యాంక్‌ లోన్‌ ద్వారా రూ.20,000 డౌన్‌పేమెంట్‌ చేసి బైక్‌ తీసుకున్నాడు. కొత్త బండికి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో అతడు..భారీ బ్యాండ్‌ బాజా ఏర్పాటు చేశాడు. సుమారుగా రూ. 60,000 వరకు ఖర్చు చేసిన భారీ హంగామాతో ఆ బైక్‌కు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో DJ పాటలు, గుర్రపు బండిని ప్రదర్శించారు. కొత్తగా కొన్న మోపెడ్‌ను క్రేన్‌కు కట్టి నడిపించారు. అయితే శోభాయాత్రలో పెద్దఎత్తున DJ సౌండ్స్‌ పెట్టేందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు..అధికారుల జోక్యం పండుగ వాతావరణం కాస్త తలకిందులైంది. శివపురిలో జరిగిన ఈ అసాధారణ వేడుకకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

వార్త చదువుతుంటే..ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ, వైరల్‌ వీడియో ఆధారంగా గుర్రపు బగ్గీలో ఊరేగుతున్న టీ స్టాల్‌ నిర్వాహకుడు మురారీలాల్ కొత్త బైక్‌ కొన్నాడు. కానీ, పోలీసుల పర్మిషన్‌ లేకుండా డీజే ఏర్పాటు చేయటంతో పోలీసులు చర్యలు తీసుకుని డీజేను సీజ్ చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా, వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు. కొందరు దీనికి సమాధానంగా మన భారతీయులకు అన్నీ వేడుకలే అంటున్నారు. ప్రత్యేకించి, ఓ పండగ అంటూ అవసరం లేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..