AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Heating: ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

పాలలో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. పాలలో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా చేస్తుంది. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలని చెబుతుంటారు. పాలలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, మన దేశంలో అందరూ దాదాపు పాలను మరిగించిన తర్వాతే ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం. కానీ, ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్యాకెట్‌ పాలను ఎక్కువ సేపు మరిగించకూడదని డైటీషియన్లు చెబుతున్నారు. ఎక్కువ సేపు మరిగిస్తే ఏమవుతుందో తెలుసా..?

Jyothi Gadda
|

Updated on: Oct 15, 2024 | 8:35 AM

Share
పూర్వ కాలంలో గెదేలు, ఆవులు ఉన్న వారింటికి వెళ్లి అప్పుడే తీసిన పాలను తీసుకోని వచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఏకంగా గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లు వచ్చాయి. అయితే, స్థానికంగా పాలను కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే బ్యాక్టీరియా నాశనం కాదు. పాలను వేడి చేయడానికి ముఖ్య కారణం అదే. కానీ, ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అంటే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2 / 5
అయితే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. ప్యాకెట్ పాలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ బాగా ఉండి, సరిగ్గా స్టోర్ చేసి ఉంటే ప్యాకెట్ పాలను మరిగించకుండా ఉపయోగించుకోవడమే మంచిది.

3 / 5
ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా డైరీ నుంచి  తీసుకొచ్చిన పాలను మాత్రం కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది. ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా నాశనం అయి అవసరమైన పోషకాలు మిగులుతాయి.

4 / 5
అలాగే ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. పాలు పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాలపాటు వేడి చేస్తే చాలు. అంతకు మించి వాటిని వేడి చేయవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..

శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..

ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ

ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం

పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?

ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్

కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త