Watch: గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. కిటికీలోంచి చేతివాటం చూపించిన దొంగ..
వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు గుడిలో శ్లోకాలు చదువుతుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ శంకర్ నగర్‌లోని వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్10న ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. దొంగ ఎత్తుకెళ్లిన బంగారు గొలుసు బరువు 30 గ్రాములు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

