AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం

AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం

Ravi Kiran

|

Updated on: Oct 15, 2024 | 7:23 AM

ఏపీ వాసులకు అలర్ట్. మరో గండం తరుముకొస్తోంది. అవసరమైతేనే బయటకు రండి. ఇప్పటికే గవర్నమెంట్‌ హైఅలర్ట్‌ మెసేజ్‌లు పాస్‌ చేసింది. అధికారులు వార్నింగ్‌ బెల్స్‌ మోగించారు. జాగ్రత్తగా వినండి..16, 17... ఈ రెండు తేదీల్లో బీ కేర్‌ఫుల్‌.!

ఏపీని మరోసారి వాన గండం వెంటాడుతోంది. ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు పయనించనుంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ .. బాపట్ల, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చిత్తూరు, కడప సహా రాయలసీమలో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 15, 2024 07:22 AM