బంగారం ప్రియులకు గుడ్ ‌న్యూస్.. ఇకపై గోల్డ్ కొనేందుకు షోరూమ్ వెళ్లాల్సిన పనిలేదు..!

మనకు ఏటీఎం తెలుసు...! వాటర్ ఏటీఎం గురించి కూడా తెలుసు. మొబైల్ ఎటీఎం, మొబైల్ బుక్ వ్యాన్, మొబైల్ మెడికల్ హెల్త్ చెకప్, మొబైల్ డీజిల్, పెట్రోల్ వ్యాన్‌ల గురించి కూడా తెలుసు..! అయితే మొబైల్ గోల్డ్ వ్యాన్ గురించి తెలుసా..?

బంగారం ప్రియులకు గుడ్ ‌న్యూస్.. ఇకపై గోల్డ్ కొనేందుకు షోరూమ్ వెళ్లాల్సిన పనిలేదు..!
Gold Van
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Oct 15, 2024 | 12:32 PM

మనకు ఏటీఎం తెలుసు…! వాటర్ ఏటీఎం గురించి కూడా తెలుసు. మొబైల్ ఎటీఎం, మొబైల్ బుక్ వ్యాన్, మొబైల్ మెడికల్ హెల్త్ చెకప్, మొబైల్ డీజిల్, పెట్రోల్ వ్యాన్‌ల గురించి కూడా తెలుసు..! అయితే మొబైల్ గోల్డ్ వ్యాన్ గురించి తెలుసా..? తాజాగా అందుబాటులోకి వచ్చిన మొబైల్ గోల్డ్ వ్యాన్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

అంది వస్తున్న ఆధునిక టెక్నాలజీ సహాయంతో సౌకర్యాలన్నీ మన చెంతకే వస్తున్నాయి. ఏదైనా వస్తువులు కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆయా షాప్‌ల వద్దకే వెళ్లి క్రయ.. విక్రయాలు జరిపేవారు. కానీ ఇటీవల కాలంలో ఈ కామర్స్ వ్యవస్థ వచ్చాక, కంటిని నచ్చిన వస్తువు కొంటే చాలు.. క్షణాల్లో మన ముంగిటకు వచ్చేస్తున్నాయి. అలాగే ఏటీఎంలా మాదిరిగా అన్ని వస్తువులు, సేవలు కూడా మొబైల్ వ్యాన్ రూపంలో వస్తున్నాయి. గుండు సూది నుంచి గోల్డ్ వస్తువుల దాకా..!

ముఖ్యంగా భారతీయులు బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే బంగారం అమ్మకం, కొనుగోళ్ల కోసం గోల్డ్ షాప్ల వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి బంగారం కొనుగోలు చేసే మొబైల్ వాహనాన్ని వ్యాల్యూ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేసింది. బులియన్ వ్యాపారంలో 120 ఏళ్ల అనుభవం ఈ సంస్థ మొబైల్ గోల్డ్ వ్యాన్ నిర్వహిస్తోంది. అవసరాల కోసం బంగారం అమ్మాలనుకునే వారు బంగారం షాప్ కు వెళ్లకుండా ఈ మొబైల్ వ్యాన్ వద్దకే వెళ్లి విక్రయించుకోవచ్చు.

అమ్మకానికి తెచ్చిన బంగారం నాణ్యతను పరీక్షించి, అధిక విలువ కోసం బంగారం కరిగించి, తక్షణమే ఈ మొబైల్ గోల్డ్ వ్యాన్ వద్ద డబ్బు పొందవచ్చు. ఒకే వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కూడా ఈ మొబైల్ గోల్డ్ వ్యాన్ వద్ద బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు ప్రక్రియలన్నీ వాహనంలో ఏర్పాటు చేశారు. లోన్‌లో ఉన్న బంగారాన్ని తామే విడిపించి మార్కెట్ ధరకు కోనుగోలు చేసి గరిష్ట ధర కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

బులియన్ వ్యాపారంలో ఉన్న వ్యాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్ గోల్డ్ అనుబంధ సంస్థ. క్యాప్స్ గోల్డ్ రిటైల్ జ్యూవెలరీ, జ్యూవెలరీ తయారీ, గోల్డ్ రీఫైనరీ సేవలు అందిస్తోంది. గత ఏడాది మొబైల్ గోల్డ్ వ్యాన్ ను ప్రారంభించి హైదరాబాదు మహానగరంలోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి తోపాటు ఇటీవల చింతల్ ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించారు. వినియోగదారులకు మొరుగైన మరిన్ని సేవలు అందించేందుకు వాల్యూ గోల్డ్ గ్రామాలకు విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రెండు జిల్లాల్లో మొబైల్ గోల్డ్ వ్యాన్ సేవలు అందించామని, అక్టోబర్ 23వ తేదీ వరకు నల్లగొండ, మిర్యాలగూడలో మొబైల్ గోల్డ్ వ్యాన్ ద్వారా సేవలు అందిస్తామని వాల్యూ గోల్డ్ అధినేత అభిషేక్ చందా తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..