TSLPRB: ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు అప్పుడే వెల్లడి

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్‌ నియామకాలకు సంబంధించిన తుది రాతపరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి కసరత్తు మొదలుపెట్టింది.

TSLPRB: ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు అప్పుడే వెల్లడి
Telangana Police
Follow us

|

Updated on: Apr 17, 2023 | 8:02 AM

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్‌ నియామకాలకు సంబంధించిన తుది రాతపరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్‌ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదు చేసుకునేందుకు అవకాశమిస్తారు. గత నెల 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఈ నెల 30 నాటికి ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తయిన పరీక్షల పత్రాల మూల్యాంకనానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు.

అయితే లక్షల్లో ఉన్న పత్రాల్ని మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు మే నెలంతా సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అటు టీఎస్‌పీఎస్సీ, ఇటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలు బహిర్గతం కావడంతో మళ్లీ ఎలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సమయం ఎక్కవైనా గాని పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను జూన్‌లో పరిశీలించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో దరఖాస్తు పరిశీలన వేదికలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిశీలించాలని గతంలో నిర్ణయించారు. ఈసారీ కూడా అలానే చేయడంతో సమయం చాలావరకు ఆదా కానుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారి అభ్యర్థుల నేరచరిత గురించీ ఆరా తీస్తారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..