Hyderabad: హైదరాబాద్‌లో మరో ‘రియల్‌’ భారీ మోసం.. ఆశ చూపారు.. అడ్డంగా రూ.50 కోట్లు దోచేశారు..

వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ఆశపెట్టారు.. దీంతో తక్కువ ధరకే ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని ఆశపడ్డారు. కట్ చేస్తే.. కంపెనీ బోర్డు తిప్పింది. దీంతో లక్షలు లక్షలు కట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో ‘రియల్‌’ భారీ మోసం.. ఆశ చూపారు.. అడ్డంగా రూ.50 కోట్లు దోచేశారు..
Hyderabad Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 16, 2023 | 4:37 PM

వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ఆశపెట్టారు.. దీంతో తక్కువ ధరకే ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని ఆశపడ్డారు. కట్ చేస్తే.. కంపెనీ బోర్డు తిప్పింది. దీంతో లక్షలు లక్షలు కట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన మరో రియల్‌ మోసం.. బాధితుల్లో కలవరానికి గురిచేసింది. వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పిన హైదరాబాద్‌ మియాపూర్‌లోని మైత్రీ ప్రాజెక్ట్స్ కంపెనీ చివరకు బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డు పడ్డారు. రాయల్ లీఫ్, రాయల్ పారడైజ్, రాయల్ మింట్ అనే అందమైన పేర్లతో 300 మంది దగ్గర సుమారు 50 కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేశాడు మైత్రీ ప్రాజెక్ట్స్ ఎండీ జానీ భాషా.

రాత్రికి రాత్రి ఫ్యామిలీతో జంప్‌ అయ్యాడు. దాంతో.. మోసపోయామని గుర్తించిన బాధితులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌ మియాపూర్ ఆల్విన్ కాలనీలో మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేశారు. మూడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.

మోసపోయివాళ్లంతా మధ్య తరగతి వారే కావడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు బాధితులు. ఇదిగో ఈ బాధితురాలు కూడా మైత్రీ ప్రాజెక్ట్‌ రియల్‌ ఎస్టేట్‌కు 20 లక్షలు కట్టి మోసపోయారు. ఓపెన్‌ ప్లాట్‌ కోసం మైత్రీ ప్రాజెక్ట్‌ ఎండీ జానీ బాషా 25 లక్షలు కట్టించుకుని మోసం చేశాడని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ముద్దు ముద్దు పేర్లతో వెంచర్లను చూపించి బాధితులను మైత్రి ప్రాజెక్ట్స్ సంస్థ నిండా ముంచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..