AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గన్‌తో సీఎం కేసీఆర్‌ సభ వైపు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున గన్‌తో హల్చల్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం భారీ విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. అయితే, అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున ఓ వ్యక్తి గన్‌తో హల్చల్‌ చేశాడు. ఓ వ్యక్తి గన్‌తో ముఖ్యమంత్రి సభా వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

Hyderabad: గన్‌తో సీఎం కేసీఆర్‌ సభ వైపు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున గన్‌తో హల్చల్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌..
Hyderabad Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2023 | 2:26 PM

Share

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం భారీ విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. అయితే, అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున ఓ వ్యక్తి గన్‌తో హల్చల్‌ చేశాడు. ఓ వ్యక్తి గన్‌తో ముఖ్యమంత్రి సభా వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేశారు.

గన్‌తో హల్చల్‌ చేసిన వ్యక్తిని గురు సాహెబ్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. ఆత్మరక్షణ కోసం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో రైఫిల్‌, పిస్టల్‌కు అనుమతి పొందిన గురు సాహెబ్‌సింగ్‌.. రిటైర్‌మెంట్‌ తర్వాత యూట్యూబ్ స్టార్ దొండ్ల మధుయాదవ్ వద్ద ప్రైవేట్‌ గన్‌మెన్‌గా చేరాడు. అప్పటినుంచి లాంగ్‌ రైఫిల్‌తో విధులు నిర్వహిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం గురు సాహెబ్‌సింగ్‌.. తన రైఫిల్‌ను మధుయాదవ్‌ డ్రైవర్‌ అయిన శివప్రకాష్‌కు ఇచ్చాడు. దాంతో.. అతను.. గురు సాహెబ్‌సింగ్‌తో కలిసి అంబేద్కర్‌ విగ్రహావిష్కకరణ రోజున సీఎం సభా వేదిక వద్ద కలకలం సృష్టించాడు. అలెర్ట్‌ అయిన పోలీసులు.. ఇరువుర్ని అదుపులోకి తీసుకున్నారు. గురు సాహెబ్‌సింగ్, మధుయాదవ్, శివప్రకాష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

గురు సాహెబ్‌సింగ్‌ నుంచి లాంగ్ రైఫిల్, పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా లాంగ్ రైఫిల్‌ను వాడుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 25 IB (a), 30 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..