AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి ఎక్కడ కన్నెర్ర చేసినా.. ఓరుగల్లుపైనే ప్రతాపం ఎందుకని? పెద్దనగరానికి.. పెద్ద కష్టం!

భారీ వర్షాల్లో రెండు జిల్లాలను దాటి వెళ్లగలిగిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్.. వరంగల్‌ను దాటలేకపోయింది. రైలు దిగి బస్సులు, ఆటోలు పట్టుకుని ఎక్కడివాళ్లక్కడే వెళ్లిపోవాల్సి వచ్చింది. రఘునాథపల్లి దాటితేనే కాజీపేట, హన్మకొండ మీదుగా వరంగల్‌లో అడుగుపెడతాం. పొలిమేర దాకా వెళ్లగలిగిగా.. ఊళ్లోనికి రానిస్తేగా. హైవేను ఛిద్రం చేసేలా వరద. ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లేవి, అటు విజయవాడ నుంచి వచ్చేవి.. వరంగల్‌కి వచ్చే సరికి ఆగిపోయాయ్. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. 'ఈ నగరానికి ఏమైంది' అనే డైలాగ్ వరంగల్‌కు సరిగ్గా సరిపోతుందనిపించింది

ప్రకృతి ఎక్కడ కన్నెర్ర చేసినా.. ఓరుగల్లుపైనే ప్రతాపం ఎందుకని? పెద్దనగరానికి.. పెద్ద కష్టం!
Flash Floods In Warangal
Balaraju Goud
|

Updated on: Oct 30, 2025 | 10:03 PM

Share

చుట్టుపక్కల నదులున్నాయా? అంటే ఏం లేవే..! దగ్గర్లో పెద్ద ప్రాజెక్టులేమైనా ఉన్నాయా? అలాంటివేం లేవే..! పోనీ.. అదేమైన తీరప్రాంతమా? కాదే..! వర్ష ప్రభావం భారీగా ఉండే ప్రాంతమా? అది కూడా కాదే..! మరెందుకని వరంగల్‌కు ఈ శాపం? ఎక్కడో ఒంగోలుకు అటుఇటుగా వస్తుందని అనుకున్న మొంథా తుఫాన్.. ఓరుగల్లుపై విరుచుకుపడడమేంటి? కామారెడ్డిలో చరిత్ర చూడని వర్షం పడినప్పుడు.. వరణుడు వరంగల్ జిల్లావైపు కూడా ఓ చూపు చూడ్డమేంటి? హైదరాబాద్‌లో రికార్డ్ వర్షపాతం అని ఓవైపు బ్రేకింగ్స్ వేస్తుంటే.. వరంగల్ కూడా మునిగిందంటూ దానికి సమానంగా మరో బ్రేకింగ్ వేయాల్సి రావడమేంటి? వరంగల్‌కు వరదొస్తే అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రులనే రప్పించుకునేంత రేంజ్ వర్షాలు చూస్తోంది వరంగల్. రెండేళ్లనాటి మోరంచపల్లి వరద బీభత్సాన్ని దశాబ్దాలైనా మరువగలమా? అసలు ప్రకృతి వైపరీత్యాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఉండుంటే.. అది ఉమ్మడి వరంగల్ జిల్లానేమో! ఎందుకని? కాకతీయులు నిర్మించిన చెరువుల గొలుసుకట్టు కట్టలను ఆక్రమించడమా? ప్రకృతి కన్నెర్రకు మనిషి అత్యాశ కూడా తోడైనందుకే ఈ విపత్తా? తెలంగాణ రెండో రాజధానిగా పేరున్న త్రినగరికి ఎందుకీ పరిస్థితి? భారీ వర్షాల్లో రెండు జిల్లాలను దాటి వెళ్లగలిగిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్.. వరంగల్‌ను దాటలేకపోయింది. రైలు దిగి బస్సులు, ఆటోలు పట్టుకుని ఎక్కడివాళ్లక్కడే వెళ్లిపోవాల్సి వచ్చింది. రఘునాథపల్లి దాటితేనే కాజీపేట, హన్మకొండ మీదుగా వరంగల్‌లో అడుగుపెడతాం. పొలిమేర...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి