Telangana: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్‌!

గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మధ్యలోనే వదిలివేసి వెళ్లిపోయాడు అంబులెన్సు డ్రైవర్‌

Telangana: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్‌!
108 Vehicle
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 17, 2024 | 7:39 AM

ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే, మరింత ఆపదలో నెట్టేసి వెళ్లిపోయాడు. గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మధ్యలోనే వదిలివేసి వెళ్లిపోయాడు అంబులెన్సు డ్రైవర్‌. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. కాళేశ్వరం మండలంలోని కన్నెపల్లికి చెందిన శనిగరం బాపురెడ్డికి శనివారం(నవంబర్‌ 16) గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లేందుకు సమీప బంధువు చల్ల తిరుపతి కారులో బయల్దేరారు. కారులో ఆక్సిజన్‌ లేకపోవడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌ చేశారు.

దీంతో భూపాలపల్లికి సమీపంలో 108 వాహనం రోగిని తీసుకువెళ్లేందుకు వచ్చింది. ఆక్సిజన్‌ పెడుతూ కొద్ది దూరం తీసుకెళ్లారు. వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లాలని బంధువులు సూచించడంతో తమ పరిధి భూపాలపల్లి వరకేనని అంతకు మించి రాలేనని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు జిల్లా కలెక్టరేట్‌ మెయిన్‌ గేటు జాతీయ రహదారి వద్దే రోగిని దించేసిన 108 డ్రైవర్‌ వెళ్లిపోయాడు. దీంతో మళ్లీ తిరుపతి తన కారులోనే ఎక్కించుకుని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సరియైన సమయంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బాపురెడ్డి బయటపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులుగా 108 జిల్లా మేనేజర్‌ మధు, వాహన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..