AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముమ్మరంగా సమగ్ర కుటుంబ సర్వే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్లలో పూర్తయ్యిందంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సర్వే వివరాలు సేకరిస్తున్నారు.

Telangana: ముమ్మరంగా సమగ్ర కుటుంబ సర్వే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్లలో పూర్తయ్యిందంటే?
Samagra Kutumba Survey
Sravan Kumar B
| Edited By: |

Updated on: Nov 16, 2024 | 10:04 PM

Share

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు వారి బ్లాకుల్లోని ఇళ్లను సందర్శించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నవంబర్ 9వ తేదీ నుండి వారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే సజావుగా సాగేందుకు, మూడు సర్కిళ్లకు ఒక్కొక్క నోడల్ అధికారి నియమితులయ్యారు. వారీ తో పాటుగా జోనల్ కమిషనర్లు మానిటరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోడింగ్ ప్రక్రియ నమోదుకు అవసరమైన సూచనలు అక్కడిక్కడే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం 149073 కుటుంబాలు సర్వే పూర్తి కాగా, ఇప్పటి వరకు మొత్తం .841256.. కుటుంబాల వివరాలు సర్వే చేయబడ్డాయి.

ఇక 15వ తారీకు లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 45 శాతం కులగణన సర్వే పూర్తయింది. మొత్తం 51,24,542 ఇళ్లల్లో సర్వే పూర్తి చేశారు. 52,493 గ్రామీణ, 40 వేల 901 అర్బన్ బ్లాక్డ్ గా మొత్తం 92, 901 బ్లాకులకు విభజించి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ సర్వే పర్యవేక్షించడానికి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వ నియమించింది. సమగ్ర కులగణన సర్వే జరుగుతున్న తీరు వివరాల సేకరణ పై అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కే వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..