Telangana: రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఖాతాల్లో డబ్బులు జమ.. ఎప్పుడంటే?

ఈరోజు నుంచి వరి కొనుగోలుకి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్ చెల్లించనుంది. సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసి జారీ చేసింది.

Telangana: రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఖాతాల్లో డబ్బులు జమ.. ఎప్పుడంటే?
Farmers
Follow us
Sravan Kumar B

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 16, 2024 | 10:03 PM

తాము రైతు సంక్షేమ ప్రభుత్వమని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తూ రూ.18 వేల కోట్లను రైతు ఖాతాలోకి జమ చేసింది ప్రభుత్వం..ఇక రైతులకు ఇచ్చిన హామీలలో మరో ముఖ్యమైన హామీ వరి కొనుగోలుకి రూ. 500 బోనస్ చెల్లించడం.. దానికి సంబంధించి నవంబర్ 16న మరో అడుగు ముందుకు పడింది. సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసి జారీ చేసింది.

48 గంటల్లో రైతు ఖాతాల్లోకి 500 బోనస్ డబ్బులు చేరనున్నాయి. ఈనెల 11న శాంపిల్‌గా ఓ రైతు ఖాతాలోకి రూ.500 బోనస్ చొప్పున రూ.30,000 లను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. అకౌంట్లకు డబ్బులు జమ అయినట్టుగా రైతు మొబైల్ కి మెసేజ్ కూడా వచ్చింది. దీంతో శనివారం సుమారు కోటి రూపాయలకు పైగా చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకం చేసింది.  ప్రతి క్వింటాకు 500 చొప్పున రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే బోనస్ చెల్లించటానికి ఒక ప్రాసెస్ ఉంటుందని సన్న రకాల వరి కొనుగోలు చేశాక దానికి సంబంధించిన డేటా ప్రభుత్వానికి చేరిన తర్వాత దాని నుంచి ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఎంత డబ్బు చేరాలనే సమాచారం పూర్తిగా సేకరించడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రెస్‌మీట్లో ప్రకటించారు. ఒక్కసారి ప్రభుత్వం వద్దకు సమాచారం వచ్చిన వెంటనే 500 బోనస్‌ను రైతు ఖాతాలోకి రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం రిలీజ్ చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి ఆ డబ్బులు చేరుతాయని ప్రకటించింది. దాని ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్‌కి నవంబర్ 16న రైతు ఖాతాల్లోకి డబ్బులను ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రైతు భరోసాకి సంబంధించి కూడా ప్రభుత్వం తొందర్లో రైతులకు శుభవార్త చెబుతామంటుంది. రైతు భరోసాకి సంబంధించి విధివిధానాలు రూపొందించటానికి ఇప్పటికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈలోగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ విడుదల చేసిన నేపథ్యంలో రెండు లక్షల పైబడిన రుణమాఫీకి సంబంధించి కూడా ఈ డిసెంబర్ 9 లోగా మరో 10 వేల కోట్లు విడుదల చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే 2 లక్షల లోపు రుణమాఫీ, డిసెంబర్ 9లోగా 2 లక్షల పైబడిన వాళ్లకి రుణమాఫీ, రైతు భరోసాపై తొందర్లో నిర్ణయంతో పాటు ఆరు గారంటీలలో మాటిచ్చినట్టుగా సన్నాలకు 500 బోనస్ ఇస్తూ మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?