TRS vs BJP: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. అదంతా నిజం కాదంటూ పుకార్లకు చెక్..

TRS vs BJP: నల్లగొండ జిల్లాకు చెందిన రాజకీయ నేతల్లో తేరా చిన్నపరెడ్డి కూడా ముఖ్యులు అనే చెప్పాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన ..

TRS vs BJP: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. అదంతా నిజం కాదంటూ పుకార్లకు చెక్..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 8:54 PM

TRS vs BJP: నల్లగొండ జిల్లాకు చెందిన రాజకీయ నేతల్లో తేరా చిన్నపరెడ్డి కూడా ముఖ్యులు అనే చెప్పాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన చిన్నపరెడ్డిపై ఇటీవల కాలంలో గాలి పుకార్లు ఎక్కువయ్యాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఈ నేత త్వరలోనే కాషాయం కండువా కప్పుకోబోతున్నారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. అంతేకాదు.. బీజేపీ తరఫున ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న పుకార్లపై తాజాగా తేరా చిన్నపరెడ్డి స్పందించారు. తాను టీఆర్ఎస్‌ను వీడేది లేని కరాఖండిగా తేల్చి చెప్పారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలే అని ఖండించారు. సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి తాను ఎల్లప్పుడూ విధేయుడినే అని స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను ఇప్పుడు ఎమ్మెల్సీని అని, మరో ఏడాది పాటు తన పదవీకాలం ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చిన్నపరెడ్డి అన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదించారనే దాంట్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే తేరా చిన్నపరెడ్డి ఇటీవల బీజేపీ నేతలతో భేటీ అయ్యారని, నాగార్జునసాగర్ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే ఆయన పలు దఫాలు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే మక్కువ ఆయనలో ఉందని, టీఆర్ఎస్ నుంచి ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేనందున చిన్నపరెడ్డి బీజేపీపై మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆయనపై వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం.. ఎంతవరకు అబద్ధం అనేది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Also read:

Telangana: పోష‌కాహార లోపాన్ని నిర్మూలించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం… స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌…

Farmers Protest: ఆందోళన విరమిస్తున్నాం.. కీలక ప్రకటన చేసిన భాతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ తికాయత్..