Farmers Protest: ఆందోళన విరమిస్తున్నాం.. కీలక ప్రకటన చేసిన భాతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ తికాయత్..
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి.

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. తాజాగా మరో యూనియన్ తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది. తాము ఆందోళనలను విరమిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ తికాయత్ ప్రకటించారు. ప్రభుత్వ విధానాలతో తాము ఆందోళన విరమించక తప్పని పరిస్థితి నెలకొందని నరేష్ తికాయత్ అన్నారు. ఇప్పటికే విద్యుత్, నీరు వంటి సదుపాయాలను తొలగించారని, ఈ పరిస్థితిలో ఇక్కడ ఉండి చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే ఆందోళన శిబిరాలను తొలగించి వెళ్లిపోవాలనుకుంటున్నామని నరేష్ తికాయత్ తెలిపారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే రెండు రైతు సంఘాలు తాము ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి 26న చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.
Also read:
అంతరిక్షంలోకి ప్రయాణించాలనుకుంటున్నారా… టికెట్ కొనడానికి రూ.400కోట్లు సిద్ధం చేసుకోండి..?