అంతరిక్షంలోకి ప్రయాణించాలనుకుంటున్నారా… టికెట్ కొనడానికి రూ.400కోట్లు సిద్ధం చేసుకోండి..?

పర్యాటక రంగం విస్తరిస్తోంది.  ఏడు ఖండాలను దాటి రోదసిలోకి దూసుకెళ్లింది.  వచ్చే ఏడాది జనవరిలో స్పేస్ టూర్ ప్రారంభం కాబోతుంది.  అక్సియోమ్ సంస్థ నిర్వహిస్తున్న 'ఎఎక్స్-1 స్పేస్ మిషన్' పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. 

అంతరిక్షంలోకి ప్రయాణించాలనుకుంటున్నారా... టికెట్ కొనడానికి రూ.400కోట్లు సిద్ధం చేసుకోండి..?
Follow us

|

Updated on: Jan 28, 2021 | 8:00 PM

పర్యాటక రంగం విస్తరిస్తోంది.  ఏడు ఖండాలను దాటి రోదసిలోకి దూసుకెళ్లింది.  వచ్చే ఏడాది జనవరిలో స్పేస్ టూర్ ప్రారంభం కాబోతుంది. అక్సియోమ్ సంస్థ నిర్వహిస్తున్న ‘ఎఎక్స్-1 స్పేస్ మిషన్’ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.  అంతరిక్ష యాత్ర నిర్వహించబోతోన్న తొలి పూర్తి స్థాయి ప్రైవేటు సంస్థగా అక్సియోమ్ ఖ్యాతి గడించింది.  అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి (ఐఎస్ఎస్)కు ముగ్గురు పర్యాటకులు వెళ్లనున్నారు.  అక్సియోమ్ మిషన్ 1(ఎఎక్స్-1) కోసం నాసాతో అక్సియోమ్ సంస్థ వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది.  అంతరిక్షంలోకి ఈ తొలి వినోద యాత్ర చాలా ఖరీదైన వ్యవహారమే.  ఐఎస్ఎస్ కు వెళ్లడానికి ఒక్కొక్కరు రూ.400 కోట్లు(55 మిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నారు.

ఆ ముగ్గురు యాత్రికులు ఎవరంటే.. 1. అమెరికా దేశానికి చెందిన రియల్ ఎస్టేట్, టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ల్యారీ కానర్ 2. కెనడా బిజ్ నెస్ మ్యాన్ మార్క్ పాటీ 3. ఇజ్రాయిల్ పారిశ్రామికవేత్త, ఫైటర్ విమానం మాజీ పైలట్ ఐటన్ స్టిబ్బే.
ఈ టూర్ తో నమోదుకానున్న రికార్డులు..

ఐఎస్ఎస్ కు వెళ్లనున్న రెండో అతిపెద్ద వయస్కుడిగా (72 ఏళ్లు) ల్యారీ కానర్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు.  గతంలో జాన్ గ్లెన్ వ్యోమగామిగా 77ఏళ్ల వయసులో ఐఎస్ఎస్ కు ప్రయాణం చేశారు. కెనడా బిజినెస్ మ్యాన్ 50 ఏళ్ల మార్క్ పాటీ అంతరిక్షంలోకి వెళుతున్న 11వ కెనడా దేశస్థుడుగా నిలబోతున్నారు. ఇక అంతరిక్షంలోకి వెళుతున్నరెండో ఇజ్రాయిల్ దేశస్థుడిగా ఐటన్ స్టిబ్బే కూడా ఘనత అందుకున్నారు. ప్రైవేట్ క్రూ(వ్యోమగాములు)తో కూడి భూమి కక్ష్యలోకి ప్రయాణించనున్న తొలి మిషన్ గా ఎఎక్స్-1 రికార్డు సృష్టించబోతుంది.  ఈ పర్యాటక బృందానికి నాసాకు చెందిన మాజీ వ్యోమగామి, అల్జీరియాకు చెందిన మైఖేల్ లోపేజ్ సారథ్యం వహించనున్నారు.

ప్రస్తుతం అక్సి యోమ్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా లోపేజ్ పనిచేస్తున్నారు.  లోపేజ్ ఇప్పటివరకు 16 వేరు వేరు ఎయిర్‌క్రాఫ్ట్ లను నడిపిన అనుభవం ఉంది.  ఒక స్పేస్ మిషన్‌కు పైలట్ గా వ్యవహరిస్తున్న తొలి ప్రైవేట్ వ్యోమగామిగా  మైఖేల్ లోపేజ్ కూడా రికార్డు సృష్టించనున్నారు. అంతరిక్ష పర్యాటకానికి నాంది పలుకుతున్న  తొలి ప్రైవేట్ సంస్థ ‘అక్సియోమ్’.  అక్సియోమ్ సంస్థను అమెరికా నాసాకు చెందిన మాజీ ఉద్యోగి మైకేల్ సఫ్రెదిని ఏర్పాటు చేశారు.  ఈ సంస్థకు  మైకేల్ సఫ్రెదిని ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.  ఐఎస్ఎస్ కు తీసుకుపోవడానికి ఉపయోగిస్తున్న అంతరిక్ష నౌక ‘క్రూ డ్రాగన్’ ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందినది.

తొలుత ఐఎస్ఎస్ కు కార్గో సేవలను అందించే సంస్థగా “స్పేస్ ఎక్స్” ఏర్పాటైంది.  ఐఎస్ఎస్ కు కార్గో సేవలను అందించిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ రికార్డు క్రియేట్ చేసింది. దీన్ని ఎలన్ మస్క్ అనే అమెరికా వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.

స్పేస్ ఎక్స్ సంస్థ ఘనతలు…

సొంతంగా లాండింగ్ ప్రక్రియ నిర్వహించుకునే ఫాల్కన్-9 రాకెట్ భారీ బరువులను ఎత్తడానికి ఫాల్కన్ హెవీ రాకెట్ ఐఎస్ఎస్ కు సిబ్బందిని చేరవేసే ‘క్రూ డ్రాగన్’ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసిన ఘనత

స్పెస్ ఎక్స్ సంస్థ కు చెందిన డ్రాగన్ అంతరిక్ష నౌక 2012లో తొలిసారిగా కార్గోను ప్రయోగాత్మకంగా ఐఎస్ఎస్ కు తీసుకుపోవడంలో విజయం సాధించింది.  ఐఎస్ఎస్ కు ప్రయాణించిన తొలి కార్గో ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ గా రికార్డు సృష్టించింది.  ఐఎస్ఎస్ కు డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్’ తన కార్గో సేవలను అందిస్తన్నది.  2020 మే 30న నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములను ‘క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్’ ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లింది.  సిబ్బందితో కూడిన అంతరిక్ష నౌకను ఐఎస్ఎస్ కు పంపిన తొలి ప్రైవేట్ అంతరిక్ష స్పేస్ ప్లైట్ సంస్థగా ‘స్సేస్ ఎక్స్’ రికార్డు సృష్టించింది.

గతంలో స్పేస్ టూరిజమ్..

స్పేస్ టూరిజమ్ ను 2002లో  రష్యాకు చెందిన స్పేస్ టూరిజమ్ ప్రారంభించింది.  రష్యా స్పేస్ ఏజెన్సీకు చెందిన కాస్మోనాట్లు ఇద్దరు ఒకప్పటి అంతరిక్ష కేంద్రం మిర్ కు ప్రయాణించారు.  2010లో రష్యా స్పేస్ ఏజెన్సీ స్పేస్ టూరిజంపై నిషేధం విధించింది.  2001 నుంచి 2009 వరకు అమెరికా స్పేస్ టూరిజమ్ కంపెనీ స్పేస్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో  నాసా వ్యోమగాములు పాల్గొన్నారు.

Also Read:

ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వృద్ధ మహిళ.. అందులో బంగారు ఆభరణాలు.. డ్రైవర్ ఏం చేశాడో తెల్సా..?

SSC Examination Papers: పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లే.. ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. పరీక్షలు ఎప్పుడంటే..!