AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success story: 13 ఏళ్లకే కంపెనీకి సీఈవో.. కేరళ బాలుడి విజయగాథ..!

సాధారణంగా 13 ఏళ్ల వయసున్న పిల్లలు స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఉంటారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటారు. లేకపోతే ట్యూషన్ కు వెళుతూ చదువులో బిజీగా ఉంటారు. తల్లి లేదా తండ్రి మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడతారు. కానీ అదే వయసున్న ఆదిత్యన్ రాజేష్ ఒక మొబైల్ ఆప్లకేషన్ ను డెవలప్ చేసి తన సొంత ఐటీ కంపెనీని స్థాపించాడు. ఇతడి యూట్యూబ్ చానల్ కు లక్షల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. అత్యంత చిన్న వయసు సీఈవోగా గుర్తింపు పొందిన ఆదిత్యన్ రాజేష్ గురించి తెలుసుకుందాం.

Success story: 13 ఏళ్లకే కంపెనీకి సీఈవో.. కేరళ బాలుడి విజయగాథ..!
Ceo Adityan
Nikhil
|

Updated on: Apr 23, 2025 | 4:45 PM

Share

ఆదిత్యన్ జీవితం అందరికీ ఆదర్శవంతంగా మారింది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని జీవితంలో విజయం సాధించాడు. అతడు కేరళ రాష్ట్రంలోని తిరువల్లాలో జన్మించాడు. ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల వయసులోనే అతడికి కంప్యూటర్ పై ఆసక్తి పెరిగింది. దానికి కారణం అతడికి తక్కువ మంది స్నేహితులు ఉండడమే. దీంతో అతడు టెక్నాలజీతో స్నేహం చేశాడు. దానిలో మెళకువలను నేర్చుకున్నాడు. సరదాగా మొదలైన ఆ ప్రయాణం అతడిని విజయ తీరాలకు చేర్చింది.

ఆదిత్యన్ ముందుగా యూట్యూబ్ లో ఆటలు నేర్చుకున్నాడు. స్పెల్లింగ్ బీస్ లో పాల్గొనేవాడు. అనంతరం కోడింగ్ , డిజైనింగ్ పై ఆసక్తి పెరిగి, వాటిలో నైపుణ్యం సాధించాడు. దాదాపు ఆరేళ్ల వయసులోనే హెచ్ టీఎంఎల్, సీఎస్ఎస్ తదితర కోడింగ్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. టెక్నాలజీపై ఉన్న ఇష్టమే అతడిని ప్రపంచంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. కోడింగ్ నేర్చుకున్న తర్వాత తొమ్మిదేళ్ల వయసులో ఆదిత్యన్ తన మొదటి ఆండ్రాయిడ్ యాప్ ను తయారు చేశాడు. అది విజయవంతంగా పని చేయడంతో అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అది ప్రయాణానికి ప్రోత్సాహం అందజేసింది. చిన్నపిల్లవాడి సాంకేతిక నైపుణ్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఐఫోన్ లో ఉపయోగించే సాఫ్ట్ వేర్ కోసం ఒక యాప్ ను డెవలప్ చేయాలని ఆదిత్యన్ ఆకాంక్షిస్తున్నాడు.

యాప్ ను తయారు చేయడంతోనే ఆదిత్యన్ ఆగిపోలేదు. ఏ క్రేజ్ అనే పేరుతో యూ ట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా టెక్నాలజీ, కోడింగ్ గేమింగ్, వెబ్ డిజైనింగ్ గురించిన సమాచారాన్ని తన యూజర్లకు తెలియజేస్తారు. ఇతడి యూట్యూబ్ కు అనేక మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ట్రైనెట్ సొట్యూషన్స్ అనే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కంపెనీని తన స్నేహితులతో కలిసి స్థాపించాడు. అది కూాడా కేవలం 13 ఏళ్ల వయసులోనే కావడం విశేషం. ఈ కంపెనీ ఇప్పటి వరకూ 12 మంది క్లయింట్ల కోసం ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తన కంపెనీ విస్తరించడమే ఆదిత్యన్ రాజేష్ లక్ష్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్