ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వృద్ధ మహిళ.. అందులో బంగారు ఆభరణాలు.. డ్రైవర్ ఏం చేశాడో తెల్సా..?

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్నిసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు, బ్యాగులు మర్చిపోతూ ఉంటాం. వాహనాలు, రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కంగారులో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.

ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వృద్ధ మహిళ.. అందులో బంగారు ఆభరణాలు.. డ్రైవర్ ఏం చేశాడో తెల్సా..?
Follow us

|

Updated on: Jan 28, 2021 | 7:11 PM

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్నిసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు, బ్యాగులు మర్చిపోతూ ఉంటాం. వాహనాలు, రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కంగారులో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. విలువైన వస్తువులు, డబ్బు వంటివి మిస్సైతే ఆ బాధ మాములుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో వాటిని యజమానుల వద్దకు చేర్చేవారు చాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఓ ప్రయాణికురాలు నగల బ్యాగును ఆటో మర్చిపోగా.. దాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్‌.

వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్‌బోయినపల్లికి చెందిన పత్తి రాజేష్‌కుమార్‌ ఆటోడ్రైవర్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు‌. బుధవారం మధ్యాహ్నం  సమయంలో మహ్మద్‌ గౌసియా అనే వృద్ధ మహిళ ఓల్డ్‌బోయినపల్లిలో రాజేష్‌ ఆటో(టీఎస్‌13 యుఏ 2976) ఎక్కింది. వారాసిగూడలో దిగి ఇంట్లోకి వెళ్లిపోయింది. రాజేష్‌ కూడా డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత ఆటోలో అతడికి బ్యాగ్‌ కనిపించింది. అందులో గోల్డ్ ఆర్నమెంట్స్, విలువైన వస్తువులతోపాటు మహ్మద్‌ గౌసియా ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. వెంటనే ఆటోడ్రైవర్‌ ఆ బ్యాగ్‌ను చిలకలగూడ పోలీసులకు అప్పగించాడు. దీంతో నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.

Also Read:

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

Parliament canteen: ఇకపై రాయితీలు లేవు.. పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరలు.. హైదరాబాదీ మటన్ బిర్యానీ ధర..?