WITT Summit 2025: ఇవ్వాల్టి నుంచే టీవీ9 WITT సమ్మిట్.. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ..
ఢిల్లీలోని భారత్ మండపంలో టీవీ9 సమ్మిట్ జరుగనుంది. వాట్ ఇండియా థింక్స్ టుడే పేరుతో నిర్వహిస్తోన్న బిగ్గెస్ట్ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ పాటు పలువురు కేంద్రమంత్రులు, 5 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పబోయే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2025’ మూడో ఎడిషన్ సాయంత్రం ప్రారంభంకానుంది. అంతర్జాతీయ స్థాయిలోనే నెవ్వర్ బిఫోర్ ఈవెంట్ ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనుంది. వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో 5 దేశాలతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 16 ప్రదేశాలు.. మొత్తంగా 21 ప్రాంతాల నుంచి విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్‌గా పాల్గొంటారు.
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2025.. బిగ్గెస్ట్ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గత ఎడిషన్‌లో కూడా పాల్గొన్న ప్రధాని మోదీ.. దేశంలో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అయితే ఈసారి ప్రధాని మోదీ.. ప్రపంచస్థాయిలో భారతదేశం పాత్రను వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఇండియా భవిష్యత్‌ను కళ్లకుగట్టబోతున్నారా? ప్రధాని చెప్పబోయే విషయాలపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
ఈ మెగా ఈవెంట్‌లో పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొనబోతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా పలువురు ప్రముఖులు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
మొదటి రోజు కార్యక్రమాలు ఇలా..
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ప్రధాని మోదీకి సత్కారం చేయనున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత.. మైహోమ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జూపల్లి రాము రావు స్వాగత ప్రసంగం చేయనున్నారు. అనంతరం టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరున్ దాస్ మాట్లాడుతారు..
టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, విజయ్ దేవరకొండ, అమిత్ షా, జిమ్ సర్బ్, యామిగౌతమ్ పాల్గొని పలు అంశాలపై మాట్లాడనున్నారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..