Kishan Reddy: బొగ్గు రంగంలో భారతదేశం అగ్రగామి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
కోల్ బ్లాక్ వేలం ప్రొగ్రాంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బొగ్గు రంగం సాధించిన విజయాలను వెల్లడించారు. గతంలో అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బొగ్గు రంగం.. ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. 2015తర్వాత బొగ్గు రంగం ముఖ చిత్రమే మారిపోయిందన్నారు.

ఢిల్లీలో జరిగిన 12వ విడత వాణిజ్య కోల్ బ్లాక్ వేలం కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. 1 బిటి బొగ్గు ఉత్పత్తిని అధిగమించడంలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థలను ప్రశంసా పత్రాలతో సత్కరించారు కిషన్‌రెడ్డి. వన్ బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించిన భారత్ చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించారు కిషన్‌రెడ్డి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బొగ్గు కంపెనీలు, కార్మికులు, పరిశ్రమలు, వాటాదారుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. భారతదేశాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపు నడిపించడమేకాదు నెట్ జీరో చర్యల్లోనూ బొగ్గు రంగం తోడ్పాడు అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉత్పత్తి, సుస్థిరత చేదోడువాదోడుగా చేసుకొని కోల్ ఇండియా ముందుకు వెళ్తోందన్నారు కేంద్రమంత్రి.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
భారతదేశం ఇంధన భద్రతకు బొగ్గు రంగం వెన్నెముకగా నిలిచిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర మైనింగ్ సూచికను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోల్ ఇండియా 50 సంవత్సరాలు, GSI 175 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు, 11 రౌండ్లలో వేలం వేయబడిన 125 బొగ్గు గనులతో 40 వేల 900 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించామని చెప్పారు. రైల్వే ఫ్రైట్ రెవెన్యూలో సగం బొగ్గు సరఫరా ద్వారానే వస్తోందని.. బొగ్గు రంగంలో 4.78 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా