Parliament canteen: ఇకపై రాయితీలు లేవు.. పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరలు.. హైదరాబాదీ మటన్ బిర్యానీ ధర..?
ఇకపై రాయితీలు ఉండవు. ఎంపీలందరూ కొత్త ధరలు చెల్లిస్తూ టిఫిల్, భోజనాలు చేయాల్సిందే. దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Parliament canteen price list 2021: ఇకపై రాయితీలు ఉండవు. ఎంపీలందరూ కొత్త ధరలు చెల్లిస్తూ టిఫిల్, భోజనాలు చేయాల్సిందే. దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి.
పార్లమెంట్ క్యాంటీన్‌లో చౌకగా లభించే ఆహారం ఏంటో తెలుసా.. చపాతీ. అవును ఒక్కో చపాతి ధక రూ.3గా ఫిక్స్ చేశారు. అయితే నాన్ వెజ్ వంటకాల విషయంలో ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. నాన్ వెజ్ బఫెను రూ.700లకు పెంచారు. ఇక వెజ్ బఫె ధర రూ.500గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన మన హైదరాబాదీ మటన్ బిర్యానీ ధర రూ.150గా ఫిక్స్ చేశారు. గతంలో ఈ వంటకాన్ని రూ.65కి అందించేవారు.అలాగే వెజ్ మీల్ ఇక నుంచి రూ.100కి లభించనుంది. కాగా రాయితీలు తీసివేయడం వల్ల ఏటా రూ.8 కోట్లు ఆదా కానున్నట్లు సమాచారం. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్‌ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఇంతకాలం నార్తన్ రైల్వే దాని నిర్వహణ బాధ్యతలు చూసింది.
పార్లమెంట్ క్యాంటీన్‌లోని కొత్త ధరలను క్రింద చూడవచ్చు….
Also Read:
ప్రజల్ని హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలకు కళ్ళెం , కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..