AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌కు అమెరికా యుద్ధ నౌకలు వీడియో

ఇరాన్‌కు అమెరికా యుద్ధ నౌకలు వీడియో

Samatha J
|

Updated on: Apr 21, 2025 | 4:20 PM

Share

ఒకవైపు ఇరాన్ తో అణు చర్చలు మొదలు పెట్టిన అమెరికా మరోవైపు యుద్ధ నౌకలను ఆ దేశం చుట్టూ మోహరిస్తుంది. వాస్తవానికి చర్చలు మొదలు కావడానికి ముందే అమెరికా తన యుద్ధనౌక యు.ఎస్.ఎస్. కార్ల్ విన్సన్ ను ఈ ప్రాంతం వైపు నడిపించటం మొదలుపెట్టింది. దీంతోపాటు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లోని యుద్ధనౌకలు మొత్తం అరేబియా సముద్రం దిశగా ప్రయాణం మొదలుపెట్టాయి. ఇక అప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యు.ఎస్.ఎస్. హ్యారీ ఎస్. ట్రూమన్ హౌతీలపై దాడులు చేసింది. కార్ల్ విన్సన్ నౌకపై ఎఫ్ 35, ఎఫ్ 18 విమానాలు ఉన్నాయి. వీటికి తోడు అమెరికా ఫిఫ్త్ ఫ్లైట్ కూడా దాడులకు సన్నాహాలు చేస్తుంది. దీనికి స్థావరం బహ్రెయిన్ లోని మనమాలో ఉంది. ఇది ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ పెర్షియాలో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.

అమెరికా కీలక స్థావరమైన డయోగో గార్సియాలో అమెరికా బి 2 స్టెల్త్ బాంబర్లను మోహరించింది. ప్రపంచంలోనే వీటిని తలదన్నే బాంబర్లు లేవని చెప్పాలి. ఇది ఇరాన్ లో అండర్ గ్రౌండ్ స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. అమెరికా వద్ద ఇలాంటివి మొత్తం 20 ఉంటే వీటిలో ఆరును ఇరాన్ సమీపంలోకి తరలించాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అణు చర్చలు విఫలమైతే ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరిస్తున్నారు. దీనికి ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలతో తాము తేలికగా అణుబాంబును తయారు చేసుకోగలమని చెబుతుంది. ఇరాన్, అమెరికా ల మధ్య తొలి విడత చర్చలు ఓమాన్ లో జరిగాయి. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్టకాఫ్ పాల్గొన్నారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చర్చలు సాఫీగా జరుగుతున్నట్లు ధ్రువీకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో

ఆదివారం హెయిర్‌ కట్‌ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో

సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో

Follow Us