ప్రజల్ని హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలకు కళ్ళెం , కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

ప్రజలను హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలను కట్టడి చేసేలా ఇందుకు సంబంధించిన చట్టాలను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.

ప్రజల్ని హింసకు రెచ్చగొట్టే టీవీ  కార్యక్రమాలకు కళ్ళెం , కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Supreme Court
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 28, 2021 | 4:09 PM

ప్రజలను హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలను కట్టడి చేసేలా ఇందుకు సంబంధించిన చట్టాలను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ విధమైన కార్యక్రమాలను నియంత్రించినప్పుడే లా అండ్ ఆర్డర్ మీద దృష్టి సారించడానికి వీలుంటుందని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఇదెంతో ముఖ్యం అని వివరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే ఆధ్వర్యాన న్యాయమూర్తులు ఎ.ఎస్. బొపన్న, వి. రామసుబ్రమన్యన్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఢిల్లీలో గత ఏడాది తబ్లీఘీ జమాత్ కు సంబంధించి మీడియాలో ఒకవర్గం ఇఛ్చిన కవరేజీపై జమాయిత్ ఉలేమా హింద్, పీస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. కోవిద్ హాట్ స్పాట్ గా మారిన తబ్లీఘీ జమాత్ సమావేశానికి  ఓ వర్గం మతం రంగు పులిమిందని పిటిషన్ దారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోర్టు.. ముఖ్యంగా టీవీ కార్యక్రమాలు, మీడియా సంయమనంతో వ్యవహరించేలా ఉండేట్టు చూడాలని కేంద్రానికి సూచించింది. కేబుల్ నెట్ వర్క్ టెలివిజన్ (రెగ్యులేషన్) యాక్ట్ ని రీడిఫైన్ చేయాలనీ కూడా కోర్టు అభిప్రాయపడింది. మూడు వారాల తరువాత  ఈ పిటిషన్లపై తిరిగి విచారణ చేపడుతామని అత్యున్నత  న్యాయ స్థానం పేర్కొంది.

Read Also:తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు.. Read Also:ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్.