AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నామలై సంచలన ప్రకటన!

అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నారు. స్వయంగా ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు అన్నామలై. మరోసారి తాను అధ్యక్ష రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు కోసమే అన్నామలైని బీజేపీ హైకమాండ్‌ తప్పిస్తునట్టు తెలుస్తోంది. అయితే.. అన్నామలై ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది..

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నామలై సంచలన ప్రకటన!
Annamalai
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2025 | 9:55 PM

Share

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటునట్టు అన్నామలై ప్రకటన చేశారు. మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉండబోనని ప్రకటించారు. అందరితో చర్చించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని అన్నారు. తమిళనాడు బీజేపీలో చాలామంది సమర్ధులపై నేతలు ఉన్నారని అన్నారు. గత కొంతకాలంగా అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి హైకమాండ్‌ తొలగిస్తుందని ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పిద్దమవుతోంది. అన్నాడీఎంకేతో పొత్తు కోసమేయ అన్నామలైని పార్టీ అధ్యక్ష పదవి నుంచి మారుస్తునట్టు ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తుకు అన్నామలై ఆటంకంగా మారారన్న వార్తలు వచ్చాయి. దీంతో తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు రెడీగా ఉన్నట్టు అన్నామలై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇచ్చారు.

ఢిల్లీలో అమిత్‌షాతో అన్నాడీఎంకే నేత పళనిస్వామి భేటీ తరువాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అయితే పళనిస్వామి, అన్నామలై ఇద్దరు కూడా గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే… దీంతో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అన్నామలై స్థానంలొ కొత్త నేతను నియమించాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్‌కు వచ్చింది. ఇద్దరు కూడా కొంగు నాడు ప్రాంతంలో పట్టున్న నేతలే.. కాకపోతే పళనిస్వామి ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్ధిగా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.

అన్నామలై తీరుతోనే 2023లో ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే దూరమయ్యింది. దివంగత మాజీ సీఎం జయలలితపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో భారీ ఆందోళన చేపట్టారు అన్నాడీఎంకే కార్యకర్తలు. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తొలగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..