AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి "మిత్ర విభూషణ" అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత్-శ్రీలంక సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ గౌరవం. ఇది మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ పురస్కారాన్ని అందించారు. మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావించారు.

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక
Pm Modi
SN Pasha
|

Updated on: Apr 05, 2025 | 1:42 PM

Share

భారత్‌-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల నాయకులను గౌరవించడానికి ప్రత్యేకంగా ఈ అవార్డును రూపొందించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం “శ్రీలంక మిత్ర విభూషణ” ప్రదానం చేయాలని నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రధాని మోదీ ఈ గౌరవానికి ఎంతో అర్హులని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం” ” అని లంక అధ్యక్షుడు దిస్సనాయకే అన్నారు. కాగా పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ గౌరవం కేవలం వ్యక్తిగత గుర్తింపు కాదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమని అన్నారు. అలాగే పురస్కారం అందించిన శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, శ్రీలంక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధానికి, బలమైన స్నేహానికి ఈ గౌరవం నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..