Wat Pho Temple: వాట్ ఫో ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. ఈ స్థలం, బుద్ధ విగ్రహం ప్రాముఖ్యత ఏమిటంటే..
ప్రధానమంత్రి థాయిలాండ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. థాయిలాండ్ బ్యాంకాక్‌లో ఉన్న ప్రసిద్ధ వాట్ ఫో ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఇక్కడ ఉన్న బుద్ధుడిని దర్శించుకున్నారు. థాయిలాండ్‌లోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఈ వాట్ ఫో ఆలయం ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం థాయిలాండ్ చేరుకున్నారు. ఆయన థాయిలాండ్ ప్రధానమంత్రిని కలిశారు. పర్యాటక రంగంలో భారతదేశం, థాయిలాండ్ చాలా బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్‌లోని వాట్ ఫో ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోడీ సందర్శించిన ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఈ ఆలయంలో అతిపెద్ద బుద్ధుని శయన విగ్రహం ఉంది.
వాట్ ఫో థాయిలాండ్‌లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. వాట్ ఫో ఆలయంలో బుద్ధుని శయన విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని రిక్లైనింగ్ బుద్ధ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోని ఫ్రా నఖోన్ జిల్లాలో గ్రాండ్ ప్యాలెస్‌కు దక్షిణంగా రత్తనకోసిన్ ద్వీపంలో ఉంది. ఈ ఆలయం థాయిలాండ్‌లోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. ఈ ఆలయ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? దీని స్థాపకుడు ఎవరు? అనే విషయం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఈ ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలో ప్రారంభమైందని చెబుతారు.
ఆలయంలో ప్రవేశించాలంటే డబ్బులు చెల్లించాలి
వాట్ ఫో ఆలయంలో 1000 కి పైగా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఆలయం లోపల చాలా పెద్ద మైదానం ఉంది. ఈ ఆలయంలో 100 కి పైగా అందంగా చెక్కబడిన స్థూపాలు ఉన్నాయి. ఈ స్థూపాలన్నీ వేర్వేరు పరిమాణాలలో ఉంటాయి. ఆలయంలో ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే ఈ ఆలయ దర్శనం ఉచితం కాదు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి.. మన దేశ కరెన్సీలో 250 రూపాయలు చెల్లించాలి.
డ్రెస్ కోడ్ పాటించాల్సిందే
ఇది మాత్రమే కాదు.. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేక దుస్తుల కోడ్‌ను పాటించాలి. పురుషులు ప్యాంటు, పొడవాటి చేతుల చొక్కాలు ధరించి ఆలయంలోకి వెళ్లి బుద్ధుడిని సందర్శించవచ్చు. మహిళలు మోకాలి కింద వరకు ఉండే దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
బుద్ధుడు చివరి సందేశం ఇచ్చాడు
బుద్ధుడు పడుకుని తన చివరి సందేశాన్ని ఇచ్చాడని భౌద్ధుల నమ్మకం. విషపూరితమైన ఆహారం తిని బుద్ధుడు నేలపై పడుకుని తన శరీరాన్ని విడిచి పెట్టాడు. బుద్ధుడు తన చివరి సందేశాన్ని ఈ రూపంలో ఇచ్చాడు. బుద్ధుని శయన విగ్రహాన్ని మహాపరినిర్వాణ ముద్ర అని కూడా అంటారు. ఇది ప్రపంచానికి శాంతి, జ్ఞానం, నిర్మాణం సందేశాన్ని అందిస్తుంది.
బుద్ధ విగ్రహం ప్రాముఖ్యత
బుద్ధుని శయన విగ్రహం తరచుగా పశ్చిమం వైపు ఉంటుంది. పశ్చిమ దిశలో పడుకున్న బుద్ధుని విగ్రహం ఇంట్లో శాంతిని, సానుకూల శక్తిని తెస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ శయన విగ్రహం ముందు కూర్చుని యోగా చేయవచ్చు. ఈ శయన విగ్రహం చాలా అందంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
