Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిన్నిస్ రికార్డ్ కొట్టేసిన ఎలుక..దాని ప్రత్యేకత ఏంటో చూడండి

ల్యాండ్‌మైన్స్‌ కనిపెట్టడంలో ఓ ఎలుక ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. అపోపో సంస్థకు చెందిన రోనిన్ ‌అనే ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ భూమిలో ఉన్న 100కుపైగా మందుపాతరలను, 15 పేలుడు పదార్థాలను కనిపెట్టి ప్రపంచ రికార్డును కొల్లగొట్టింది. మనుషులు నాలుగు రోజుల్లో తనిఖీ చేసే ప్రాంతాన్ని ఈ ఎలుక కేవలం అరగంటలోనే సెర్చు చేయగలదని అపోపో సంస్థ వారు చెబుతున్నారు.

గిన్నిస్ రికార్డ్ కొట్టేసిన ఎలుక..దాని ప్రత్యేకత ఏంటో చూడండి
Rat Brakes World Record
Follow us
Anand T

|

Updated on: Apr 05, 2025 | 12:53 PM

గిన్నిస్ రికార్డులు మనుషులేనా..మేం కూడా క్రియేట్ చేయగలం అంటోంది ఓ ఎలుక..ఎలుక రికార్డు క్రియేట్ చేయడమేంటి అనుకుంటున్నారా…అవును అపోపో అనే స్వచ్ఛంద సంస్ధకు చెందిన రోనిన్ ‌ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ మందుపాతరలను కనిపెట్టడంలో సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎలుక ఇప్పటి వరకు దాదాపు 100కుపైగా మందుపాతరలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టింది.

“అపోపో” అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఈ సంస్థ టాంజానియా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎలుకలకు శిక్షణ ఇచ్చి మందుపాతరలను గుర్తించడానికి ఉపయోగిస్తుంది. ఈ సంస్థ దగ్గర 104 ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలను యుద్ధభూమిలో వదిలేసిన మందుపాతరలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేలా ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఈ ప్రయోగానికి ఎలుకలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం..ఇవి చిన్న సైజులో ఉండటం..మరియు వాసనను త్వరగా పసిగట్టడం. ఈ ఎలుకల సైజు చిన్నగా ఉండటం.. అవి అడుగు పెట్టినా కూడా మందుపాతరలు పేలేంత బరువు లేకపోవడంతో వీటి ద్వారా పేలుడు పదార్థాలను సెర్చ్ చేయడం సులభం అవుతోంది. దీంతో ఈజీగా మందుపాతరలను కనిపెట్టవచ్చుని అపోపో సంస్థవారు చెబుతున్నారు. ఇదే కాదు ఈ ఎలుకలు క్షయ వ్యాదిని కూడా గుర్తించగలవు.

ఈ ఎలుకల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇవి మనుషుల కన్నా చాలా వేగంగా పనిచేయగలవు..ఒక మనిషి నాలుగు రోజుల్లో మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసే ప్రాంతాన్ని.. ఈ ఎలుకలు కేవలం అరగంటలోనే తనిఖీ చేయగలవని అపోపో సంస్థ వారు చెబుతున్నారు. రోనిన్ ‌అనే ఈ ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ 2021 నుంచి ఇప్పటి వరకు 109 మందుపాతరలను కనిపెట్టినట్టు ఈ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 2020లో ఇదే సంస్థకు చెందిన ఓ ఎలుక మాగ్వా ప్రాంతంలో 71 మందుపాతరలను గుర్తించడం ద్వారా గోల్డ్ మెడల్ సాధించగా..ఇప్పుడు రోనిన్ ర్యాట్ 100కుపైగా మందుపాతరలను కనిపెట్టి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,69,713 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..ఇక్కడ క్లిక్ చేయండి