ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్

తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది.  సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది...

ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్
Follow us

|

Updated on: Nov 13, 2020 | 10:14 PM

తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది.  సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. మొట్టమొదటి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రికాార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే దీపావళి ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ..ఇన్ని రోజుల తర్వాత ఇంత మంది జనం ఉన్న కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎప్పట్నుంచో ఓటీటీ కంటెంట్ అంటే ఇష్టమని, ఓటీటీ కల్చర్ గురించి మాట్లాడేవారని తెలిపారు. తమను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన జూపల్లి ఫ్యామిలీకి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ అని, దాన్ని తెలుగుకు తీసుకురావడం గర్వంగా ఉందని చెప్పారు. దీని వల్ల తెలుగు వారికి ఉపయోగం ఉంటుందని, ఎంతో మందికి ఉపాధి దొరకుతుందని పేర్కొన్నారు. ఈ జర్నీలో భాగమయినందుకు దిల్ రాజుకు, విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌తో కలిసి తాను చేసిన యాడ్‌ను బన్నీ వీక్షకులకు చూపించారు. సుకుమార్, హరీష్ శంకర్, సురేంద్ర రెడ్డి, వంశీ పైడిపల్లి లాంటి పెద్ద డైరెక్టర్లు ఆహా కోసం షోస్ చేయబోతున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!