కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై భాగస్వాములకు ఆహ్వానం పలికిన ఏపీ సర్కార్

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై భాగస్వాములకు ఆహ్వానం పలికిన ఏపీ సర్కార్

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న భాగస్వాములను ఆహ్వానిస్తూ ఏపీ సర్కార్ ఆర్​ఎఫ్​పీ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఈ మేరకు గ్లోబల్ నోటీసు ఇచ్చింది. జాయింట్ వెంచర్ ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించినందున ఆసక్తి కలిగిన...

Sanjay Kasula

|

Nov 13, 2020 | 10:09 PM

Set Up Kadapa Steel Industry : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న భాగస్వాములను ఆహ్వానిస్తూ ఏపీ సర్కార్ ఆర్​ఎఫ్​పీ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఈ మేరకు గ్లోబల్ నోటీసు ఇచ్చింది. జాయింట్ వెంచర్ ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించినందున ఆసక్తి కలిగిన ప్రైవేటు భాగస్వాములు ప్రతిపాదనల్ని సమర్పించాలంటూ నోటీసులో ప్రభుత్వం పేర్కొంది.

వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను సమర్పించాల్సిందిగా తెలిపింది. అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న సంస్థలు ఆర్​ఎఫ్​పీ సమర్పించాలని సూచించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి వివాదాలు లేని 3500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ గ్లోబల్ నోటీసులో స్పష్టం చేసింది.

ప్రతి ఏడాది 2 టీఎంసీల నీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నాలుగు లైన్ల రహదారులు, రైలు కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని గ్లోబల్ నోటీసులో వెల్లడించింది. వీటితో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులు స్టీల్ ప్లాంట్​కు సమీపంలో ఉన్నాయని వివరించింది. ముడి ఇనుము నిల్వలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూడా ఈ యూనిట్​కు సమీపంలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్​లో పేర్కొంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu