ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్
తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది...
తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. మొట్టమొదటి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రికాార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే దీపావళి ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ..ఇన్ని రోజుల తర్వాత ఇంత మంది జనం ఉన్న కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎప్పట్నుంచో ఓటీటీ కంటెంట్ అంటే ఇష్టమని, ఓటీటీ కల్చర్ గురించి మాట్లాడేవారని తెలిపారు. తమను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన జూపల్లి ఫ్యామిలీకి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ అని, దాన్ని తెలుగుకు తీసుకురావడం గర్వంగా ఉందని చెప్పారు. దీని వల్ల తెలుగు వారికి ఉపయోగం ఉంటుందని, ఎంతో మందికి ఉపాధి దొరకుతుందని పేర్కొన్నారు. ఈ జర్నీలో భాగమయినందుకు దిల్ రాజుకు, విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌తో కలిసి తాను చేసిన యాడ్‌ను బన్నీ వీక్షకులకు చూపించారు. సుకుమార్, హరీష్ శంకర్, సురేంద్ర రెడ్డి, వంశీ పైడిపల్లి లాంటి పెద్ద డైరెక్టర్లు ఆహా కోసం షోస్ చేయబోతున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు.