రాహుల్ గాంధీలో ఆ క్వాలిటీ లేదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీలో ఆ క్వాలిటీ లేదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీపై అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కీలక కామెంట్స్‌ చేశారు. తన మెమొరీస్‌, ఒపీనియన్స్‌ను పుస్తక రూపంలో తెస్తున్న బరాక్‌ రాహుల్‌ నాయకత్వంపై.....

Ram Naramaneni

|

Nov 13, 2020 | 9:42 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీపై అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కీలక కామెంట్స్‌ చేశారు. తన మెమొరీస్‌, ఒపీనియన్స్‌ను పుస్తక రూపంలో తెస్తున్న బరాక్‌ రాహుల్‌ నాయకత్వంపై బల్లగుద్దినట్టు తన అభిప్రాయాన్ని చెప్పేశారు. అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడి మాటలు ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చకు తెరదీశాయి.

‘కాంగ్రెస్‌ నేత రాహుల్‌లో నాయకత్వ పటిమ అవసరం.. విద్యార్థి టీచర్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఎలా ప్రయత్నిస్తాడో రాహుల్‌ కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు.. సరిగ్గా ఇదే సమయంలో అతని సామర్థ్యం.. నిబద్ధత కనిపించడం లేదు’ ఈ మాటలంటున్నది మరెవరో కాదు.. రాహుల్‌ గురించి అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలివి. అవును.. అమెరికా ఫార్మర్‌ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా రాహుల్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.. తాను రాస్తున్న ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు ఒబామా.

జ్ఞాపకాలు, తన అభిప్రాయాలు, అరుదైన ఘట్టాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. దీనిని ఈనెల 17న మార్కెట్లోకి రిలీజ్‌ చేస్తున్నారు. ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌పై రివ్యూ చేసిన ద న్యూ యార్క్‌ టైమ్స్‌ కీలక విషయాలను వెల్లడించింది. రాహుల్‌ గురించి ఒబామా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఒక్క రాహుల్‌ గురించే కాదు.. సోనియా, రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ల పేర్లనూ ఒబామా ప్రస్తావించినట్టు చెప్పింది న్యూయార్క్‌ టైమ్స్‌. ఇటీవలి బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాహుల్‌పై ఒబామా కామెంట్స్‌ పొలిటికల్‌గా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also Read :

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి

తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు కూడా ఖరారు !

యాంటీ కరప్షన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ, కట్ చేస్తే అతడే మోసాలకు కేరాఫ్ అడ్రస్ !

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu