డార్లింగ్‌ ప్రభాస్ జెట్ స్పీడ్‌లో ఉన్నాడుగా, ముంబయిలో ఆగింది అందుకేనట !

డార్లింగ్‌ ప్రభాస్ జెట్ స్పీడ్‌లో ఉన్నాడుగా, ముంబయిలో ఆగింది అందుకేనట !

ఇటలీలో పూజతో రొమాన్స్‌ చేసిన డార్లింగ్‌ ముంబైలో వాలిపోయారు. హైదరాబాద్‌ వస్తారనుకుంటే.. నో నో అంటూ అక్కడే సెటిల్ అయిపోయారు.

Ram Naramaneni

|

Nov 13, 2020 | 9:24 PM

ఇటలీలో పూజతో రొమాన్స్‌ చేసిన డార్లింగ్‌ ముంబైలో వాలిపోయారు. హైదరాబాద్‌ వస్తారనుకుంటే.. నో నో అంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. లాంగ్‌ షెడ్యూల్‌తో స్ట్రెస్‌ ఫీల్ అయిన డార్లింగ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారనుకున్నారు ఫ్యాన్స్‌. అదే టైంలో ఛార్మీ పోస్ట్ చేసిన ఫోటో వైరల్ కావటంతో పాత ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నారులే అని ఫిక్స్ అయ్యారు…

అయితే న్యూస్ అంతా ఫేక్ అంటోంది ముంబై మీడియా.. డార్లింగ్ ముంబైలోనే స్టే చేయటం వెనుక అసలు విషయం వేరే ఉందట… రాధే శ్యామ్ షూటింగ్ లాస్ట్ ఫేజ్‌లోకి వచ్చేయటంతో వాట్ నెక్ట్స్ అన్న ప్లానింగ్‌లో ఉన్నారు ప్రభాస్‌.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఆదిపురుష్‌ను స్టార్ట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యారు.. అందుకే ఓం రౌత్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో మునిగిపోయారు.

లాక్‌ డౌన్‌తో వచ్చిన గ్యాప్‌ కవర్‌ చేసేందుకు… బ్రేక్‌ తీసుకోవద్దని ఫిక్స్ అయిన డార్లింగ్‌.. ఆదిపురుష్‌ పనులను స్టార్ట్ చేశారు. ప్రజెంట్‌ డార్లింగ్‌కు లుక్‌ టెస్ట్ చేస్తున్నారట.. ఈ బ్రేక్‌లోనే గెటప్‌ ఫైనల్‌ చేసేయాలని ఫిక్స్‌ అయ్యారు డైరెక్టర్ ఓం రౌత్‌. మైథలాజికల్ మూవీ కావటంతో గ్రాఫిక్స్ కోసం 250 కోట్లు ఖర్చు చేస్తున్నారట ఆదిపురుష్‌ టీం.. బాహుబలిగా బాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రభాస్‌.. రాముడిగా ఇంకేం చేస్తారో చూడాలి.

Also Read :

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు కూడా ఖరారు !

అదిరి రేంజ్‌లో ‘ఆహా’ వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

‘ఆహా’ గేమ్ ఛేంజర్‌, మున్ముందు మరింత గొప్ప కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం : రాము జూపల్లి

క్రాక్ : అదిరిపోయే మాస్ నంబర్‌తో మాస్ రాజా, అభిమానులకు పూనకాలేనట

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu