Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ఫేస్‌బుక్ యాజమాన్యం… ఇకపై అలాంటి వాటిని సిఫారసు చేయమంటూ ప్రకటన..
Facebook To Stop Recommending Political Groups: అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్ని ప్రాంతాల రాజకీయాలను ఫేస్‌బుక్ ప్రభావితం చేస్తుందనేది ఎవరూ కాదలేని నిజం. రాజకీయ నాయకుల ప్రసంగాలు..

Facebook To Stop Recommending Political Groups: అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్ని ప్రాంతాల రాజకీయాలను ఫేస్‌బుక్ ప్రభావితం చేస్తుందనేది ఎవరూ కాదలేని నిజం. రాజకీయ నాయకుల ప్రసంగాలు, వారి సంభాషణలు, వీడియోలు ఫేస్‌బుక్ వేదికగా వైరల్‌గా మారుతోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎంతో కొంత మేర వీటి ప్రభావం ఓటర్లపై కూడా పడుతోంది. దీంతో ఈ క్రమంలోనే ఇలాంటి రాజకీయ సంబంధిత గ్రూపుల సిఫారసు (రికమండేషన్ల) విషయంలో ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజకీయ సంబంధిత గ్రూపులను రికమెండ్ చేయబోయని స్పష్టం చేసింది. అమెరికాలో ఇప్పటికే ఈ చర్యలు అమలు చేస్తున్నారు. గతంలో రాజకీయ గొడవలకు ఫేస్‌బుక్ కారణంగా నిలిచిందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సివిక్, పొలిటికల్ గ్రూపులను రికమండేషన్ల జాబితా నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ అధినేత జుకెర్‌బర్గ్ పేర్కొన్నారు. అలాగే ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ ఫీడ్ నుంచి కూడా రాజకీయ కంటెంట్‌ను సాధ్యమైనంత తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఫేస్‌బుక్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జుకెర్‌బర్గ్ పేర్కొన్నారు.
Also Read: Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..