Tata curve dark edition: బ్లాక్ ఎడిషన్‌తో మైండ్ బ్లాంక్.. టాటా కర్వ్ ఈవీ నయా వెర్షన్ రిలీజ్
మన దేశంలో కార్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరలతో వివిధ మోడళ్ల కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటిలో పెట్రోలు, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ప్రజల అభిరుచికి అనుగుణంగా పలు కార్ల తయారీ సంస్థలు వివిధ మోడళ్లను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ నుంచి కర్వ్, కర్వ్ ఈవీ డార్క్ ఎడిషన్ కార్లు విడుదలయ్యాయి. వీటి ప్రత్యేతకలు, ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా కర్వ్, టాటా కర్వ్ ఈవీ కార్లు పేరుకు తగినట్టుగానే నలుపు రంగుతో ఆకట్టుకున్నాయి. వీటి ధరలు రూ.16.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ప్రత్యేక మైన డిజైన్, బ్యాడ్జింగ్, నల్లటి ఇంటీరియర్ వీటి ప్రత్యేకతలు. వీటిలో కర్వ్ డార్క్ ఎడిషన్ కారు అకంప్లిష్డ్ ఎస్, అకంప్లిష్డ్ +ఏ వేరియంట్లలో లభిస్తోంది. కర్వ్ ఈవీ డార్క్ ఎడిషన్ ను ఎంపవర్డ్ +ఏ వేరియంట్ లో తీసుకువచ్చారు. డార్క్ ఎడిషన్ సంబంధిత వేరియంట్ల కంటే రూ.32 వేలు ఎక్కువగా ఉంటుంది. అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్ లోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కారు ధర రూ.16.49 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ స్పెక్ అయిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఏడు స్పీడ్ డీఎస్జీతో రూ.19.52 లక్షల నుంచి లభిస్తోంది. ఇక ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్ లో లభించే కర్వ్ ఈవీ రూ.22.24 లక్షల ధరకు అందుబాటులోకి వచ్చింది. దీనిలో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జిపై సుమారు 502 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
టాటా కర్వ్, టాటా కర్వ్ ఈవీ డార్క్ ఎడిషన్ మోడళ్ల డిజైన్, ఇతర విషయాలకు వస్తే.. రెండూ కార్లు కార్బన్ బ్లాక్ రంగులో ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ట్ అవుట్ బంపర్లు, ప్రత్యేక మైన బ్యాడ్జింగ్, ఏరో ఇన్సర్ట్ లతో కూడిన 18 అంగుళాల డార్క్ అల్లాయ్ వీల్స్ బాగున్నాయి. కార్ల లోపలి భాగంలో నలుగు రంగు థీమ్ కొనసాగించారు. డ్యాష్ బోర్డు, సెంటర్ కన్సోల్, డోర్ ట్రిమ్ లను పియానో బ్లాక్ యాక్సెంట్, బ్ల్యూ యాంబియంట్ లైటింగ్ తో రూపొందించారు. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.30 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ చార్జింగ్, డ్యూయల్ జోన్ ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, తొమ్మిది స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు.
1.2 లీటర్ టర్బోపెట్రోల్ ఇంజిన్ , 1.5 లీటర్ డిజిల్ మిల్ తో టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ ను తీసుకువచ్చారు. హైపెరియన్ జీడీఐ టర్బో పెట్రోలు యూనిట్ నుంచి 118 బీహెచ్పీ, 170 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. అలాగే క్రియోజెట్ డీజిల్ ఇంజిన్ 116 బీహెచ్పీ, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డార్క్ ఎడిషన్ ఈవీలో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఇది 165 బీహెచ్పీ, 215 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగల సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు ఉంది. పుల్ చార్జిపై సుమారు 502 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..