- Telugu News Photo Gallery Business photos Electric vehicles available under one lakh rupees, check details in telugu
EVs under 1 lakh: లక్ష రూపాయాల్లో లక్షణమైన స్కూటర్లు.. స్టన్నింగ్ లుక్‌తో సూపర్ ఫీచర్లు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఇవే పరుగులు తీస్తున్నాయి. పెట్రోలు వాహనాల కంటే వీటిని కొనడానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కానీ సామాన్యులు మాత్రం వీటి ధరలు ఎక్కువగా ఉంటాయని భావించి, కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని తరగతుల వారికీ అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.లక్ష రూపాయల లోపు ధరలో అనేక మోడళ్లు మార్కెట్ లో కి విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ప్రత్యేకతలు, ధరలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 14, 2025 | 12:30 PM

బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.98,498 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కేవలం 4 గంటల్లో 80 శాతం చార్జి అవుతుంది. గంటకు గరిష్టంగా 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. సింగిల్ ఫుల్ చార్జిపై సుమారు 123 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. హిల్ హూల్డ్, సీక్వెన్షియల్ బ్లింకర్లు, యాప్ కనెక్టివీటి, బహుల రైడ్ మోడ్ లతో అందుబాటులోకి వచ్చింది.

హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జిపై సుమారు 80 కిలోమీటర్లు పరుగెడుతుంది. దీని బ్యాటరీని 4.30 గంటల్లో సున్నా నుంచి 80 శాతం, 6.50 గంటల్లో వంద శాతం చార్జింగ్ చేయవచ్చు. దీనిలో 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగల ఈ స్కూటర్ ధర రూ.90 వేలు (ఎక్స్ షోరూమ్).

ఓలా ఎలక్ట్రిక్ నుంచి మోటారు సైకిల్, స్కూటర్లు విడుదలై మంచి ఆదరణ పొందాయి. వాటిలో ఓలా రోడ్ స్టర్ ఎక్స్ బైక్ రూ.84,999 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీని కోసం బుకింగ్ లు మొదలయ్యాయి. 2025 మే లో ఖాతాదారులకు డెలివరీలు అందిస్తారు. దీనిలో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జి చేస్తే దాదాపు 140 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. అలాగే 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనాన్ని రూ.94,999కు కొనుగోలు చేయవచ్చు. దీని రేంజ్ 196 కిలోమీటర్లు. ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లక్ష రూపాయల లోపు ధరలో లభిస్తున్నాయి. వీటిలో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన ఎస్1 ఎక్స్ స్కూటర్ ధర రూ.64,999. సింగిల్ చార్జ్ పై 95 కిలోమీటర్లు పరుగెడుతుంది. 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.81,999, రేంజ్ 151 కిలోమీటర్లు. *4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న స్కూటర్ ను రూ.97,499కు కొనుగోలు చేయవచ్చు. ఇది సుమారు 193 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

రివోల్ట్ ఆర్వీ1 ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ మంచి లుక్ తో ఆకట్టుకుంటోంది. దీనిలో 2.8 డబ్ల్యూ మోటారును 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో జత చేశారు. కేవలం 2.15 గంటల్లో బ్యాటరీని 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. సింగిల్ చార్జింగ్ పై సుమారు వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బ్యాటరీకి ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల వారంటీ ఇచ్చారు. వీటిలో ఏది ముందు అయితే దాన్ని వర్తింపజేస్తారు. ఈవీ ఖర్చులో బ్యాటరీ సుమారు 40 శాతం ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ధర రూ.84,990 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

కలర్, డిజైన్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పెర్త్ వైట్, వాల్ నట్ బ్రౌన్, టైటానియం గ్రే గ్లోసీ అనే మూడు రకాల రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో, సింగిల్ చార్జిపై సుమారు 75 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. కేవలం 2.45 గంటల్లో బ్యాటరీని 80 శాతం చార్జి చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.89,999 (ఎక్స్ షోరూమ్)కు లభిస్తోంది.





























