ఆవుతో పాటు బెడ్‌రూమ్‌లోకి దూరిన ఎద్దు.. ఊహించని ఘటనతో ఆ ఫ్యామిలీ షాక్ వీడియో
ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు షాక్‌కు గురి చేస్తుంటాయి. ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఇది ఒక అసాధారణ సంఘటననే చెప్పొచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు అనుకోని అతిథులు దూరడంతో ఆ ఫ్యామిలీ షాక్ అయింది. ఆ అనుకోని అతిథులు ఎవరో కాదు.. ఒకటి ఆవు అయితే మరొకటి ఎద్దు. ఏకంగా బెడ్‌రూమ్‌లోకి దూరేశాయి. మంచం ఎక్కి గంట సేపు అక్కడే గడిపాయి. ఫరీదాబాద్ NIT ప్రాంతంలో డబువా కాలనీలో జరిగిందీ సంఘటన.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆవు, ఎద్దు బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అక్కడే ఉన్న మహిళ భయంతో అల్మారా వెనక దాక్కుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పొరుగింటివారు కర్రలు తీసుకుని వచ్చారు. వాటిని తరిమికొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా అవి వెళ్లకుండా దాదాపు గంటసేపు బెడ్‌రూమ్‌లోనే ఉన్నాయి. తరువాత ప్రజలు కర్రలతో బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి ఆవును, ఎద్దును బయటికి వెళ్లగొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఇంటి యజమాని రాకేష్ సాహు అన్నారు. వీధిలో ఎద్దులు, ఆవుల మంద తరచుగా తమలో తాము పోట్లాడుకుంటాయి. దీని కారణంగా వీధుల్లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడున్న దుకాణాలు దెబ్బతింటాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు చాలాసార్లు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరిగే ఆవులను, ఎద్దులను గోశాలకు పంపాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్ హత్య బెదిరింపులపై సల్మాన్ వీడియో