పామాయిల్ తోటలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్ వీడియో
ఎండాకాలం మొదలైన దగ్గరి నుంచి వనాల్లో ఉండాల్సిన పాములు వేసవి తాపాన్ని తట్టుకోలేక జనావాసాల్లోకి చేరుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. జిల్లాలోని మాడుగుల సాగరం రహదారి పక్కన ఓ పామాయిల్ తోట ఉంది. అందులో పనిచేస్తున్న కూలీలను పరుగులు పెట్టించింది ఓ భారీ కింగ్ కోబ్రా. రోడ్డుదాటి మెరుపు వేగంతో పామాయిల్ తోటలోకి దూసుకొచ్చిన కింగ్ కోబ్రాను చూసి షాకయ్యారు కూలీలు. భయంతో తలో దిక్కూ పరుగులు తీశారు.
మాడుగుల మండలం సాగరం గ్రామంలో ఈ పామాయిల్ తోట ఉంది. కూలీలందరూ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో భారీ గిరి నాగు పామాయిల్ తోటలోకి దూసుకొచ్చింది. దాదాపు 12 అడుగుల పొడవున్న ఆ భారీ కింగ్ కోబ్రాను చూసి పామాయిల్ తోటలో పనిచేస్తున్న కూలీలు ఒక్కసారిగా భయపడ్డారు. ఆ పాము హై స్పీడ్ లో తోటలోకి దూసుకొచ్చిన తీరుకు అంతా షాకయ్యారు. నిజానికి ఆ కింగ్ కోబ్రా మరో పామును వేటాడుతూ అటుగా దూసుకొచ్చింది. పామాయిల్ తోటలోని పొదల్లోకి వెళ్లి వింత వింత శబ్దాలు చేసింది. వెంటనే విషయం తోట యజమానికి చేరవేసారు కూలీలు. ఆయన స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కి, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. తక్షణం అక్కడికి చేరుకున్నారు అటవీశాఖ అధికారులు. స్నేక్ క్యాచర్ కూడా అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును బంధించాడు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్‌పై దాడికి యత్నించింది. అతన్ని కాటు వేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. అయితే వెంకటేష్ మరింత చాకచక్యంగా వ్యవహరించి పామును బంధించాడు. అనంతరం దానిని అటవీ సిబ్బంది సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్ హత్య బెదిరింపులపై సల్మాన్ వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో