AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఆ స్పెషల్ ప్లేస్‌లో రష్మిక మందన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వెళ్లారో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న శనివారం (ఏప్రిల్ 05) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న రష్మిక ఈసారి తన పుట్టిన వేడుకలను జరుపుకోవడానికి ఓ స్పెషల్ ప్లేస్ ను ఎంచుకుంది. అక్కడకు ఎవరెవరు వెళ్లారో తెలుసా?

Rashmika Mandanna: ఆ స్పెషల్ ప్లేస్‌లో రష్మిక మందన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వెళ్లారో తెలుసా?
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Apr 05, 2025 | 6:45 AM

Share

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న చాలా బిజీ బిజీగా ఉంటోంది. గత కొన్ని నెలలుగా ఆమె వరుసగా సినిమా షూటింగ్ లకు హాజరవుతోంది. కాలు విరిగినా, జ్వరంతో బాధపడినా షూటింగులు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. అయితే శుక్రవారం (ఏప్రిల్ 05) రష్మిక పుట్టిన రోజు. దీంతో ఈ స్పెషల్ డే కోసం ఆమె సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లిందని సమాచారం. అక్కడ తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరపుకొంటోందని సమాచారం. రష్మిక మందన్న గల్ఫ్ దేశాలలో ఒకటైన ఒమన్ కు వెళ్లి అక్కడి అందమైన ఎడారిలో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోనుందట. ఇందుకోసం ఇప్పటికే రష్మిక తో పాటు ఆమె స్నేహితులు మరికొందరు ఒమన్ కు వెళ్లారట. అయితే రష్మిక బర్త్ డే వేడుకల్లో విజయ్ దేవర కొండ కూడా పాల్గొంటాడని సమాచారం. ఇప్పటికే అతను కూడా ఒమన్ వెళ్లాడని టాక్. విజయ్ దేవరకొండ, రష్మిక మాత్రమే కాదు, వారి కామన్ ఫ్రెండ్స్ కూడా ఒమన్ వెళ్లారని చెబుతున్నారు.

రష్మిక మందన్న ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న నటి. ఆమె నటించిన ‘సికంర్’ సినిమా ఇటీవలే విడుదలైంది. అదనంగా, ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ‘పుష్ప 3’ సినిమాలో రష్మిక కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆమె ధనుష్ తో కలిసి ‘కుబేర’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇక ఛావా, సికందర్ తర్వాత ‘తమా’ అనే హిందీ సినిమాలోనూ రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ మూవీ ‘రెయిన్‌బో’ లోనూ యాక్ట్ చేస్తోంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు రష్మిక చేతిలో ఉన్నాయి. మొత్తం మీద, రష్మిక చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

ఒమన్ లో రష్మిక మందన్నా..

కాగా ఇప్పటికే ఓమన్ చేరుకున్న రష్మిక అక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదిస్తోంది. అక్కడి విశేషాలను, ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో రష్మిక మందన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?
వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..