Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఆ విషయంలో భయం.. అందుకే అదుర్స్ 2 చేయట్లేదు.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్..

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ హీరో హృతిక్ రోషన్ సైతం నటిస్తున్నారు. స్పె యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jr.NTR: ఆ విషయంలో భయం.. అందుకే అదుర్స్ 2 చేయట్లేదు.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్..
Jr.ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2025 | 7:15 AM

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో మ్యాడ్ స్క్రైర్ ఒకటి. యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో సూపర్ హిట్ అయిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ ఇది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించినఈ సినిమా మార్చి 28న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో మ్యాడ్ స్కైర్ సక్సెస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాడ్ టీంను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. అలాగే అదుర్స్ 2, దేవర 2 సినిమాలపై ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..”నవ్వించడం అనేది ఒక పెద్ద వరం.. అలా మనల్ని నవ్వించడానికే కళ్యాణ్ శంకర్ దొరికాడు. ఈ సినిమాలో లడ్డు (విష్ణు )లేకపోతే సినిమా హిట్ అయ్యేది కాదేమో. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ అద్భుతంగా నటించారు. దేవర సినిమాను ఆదరించినందుకు.. అంతగా అభిమానించినందుకు..మీ భూజలపై ఆ సినిమాను మోసినందుకు అందరికీ థాంక్యూ. దేవర 2 లేదు అనుకున్న వారందరికీ చెబుతున్నాను.. ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది. కాకపోతే విరామం ఇచ్చాము. ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చారు. త్వరలోనే ఒక సినిమా నాగవంశీతో చేయబోతున్నాము. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరిని హ్యాండిల్ చేయమని వదిలేస్తాను” అని అన్నారు.

ఇక అదుర్స్ 2 సినిమా గురించి మాట్లాడుతూ.. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను అని అన్నారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన అదుర్స్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..