బడ్జెట్ 2021, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతారా ?

ఫిబ్రవరి 1 న కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని, ఇన్వెస్ట్ మెంట్ ని 80సి సెక్షన్ కింద ప్రస్తుతమున్న...

  • Umakanth Rao
  • Publish Date - 5:24 pm, Thu, 28 January 21
బడ్జెట్ 2021, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతారా ?

ఫిబ్రవరి 1 న కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని, ఇన్వెస్ట్ మెంట్ ని 80సి సెక్షన్ కింద ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచవచ్చునని ఆశిస్తున్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులపై భారం కూడా తగ్గవచ్ఛు. కోవిడ్ 19  దేశంలో ఏదో ఒక విధంగా అందరిమీదా తీవ్ర ప్రభావాన్నే చూపింది. అందువల్ల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు పరిమితి విషయంలో ఈ చర్య తీసుకున్న పక్షంలో ముఖ్యంగా సామాన్యులకు ఊరట కలుగుతుంది. లిక్విడిటీ పెరగడమే కాక.. ఎకానమీ వృద్దికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. మెడికల్ ఇన్స్యూరెన్స్ కవరేజీకి సంబంధించి నాన్-సీనియర్ సిటిజన్లకు  ఈ సౌకర్యాన్ని 25 వేలనుంచి 50 వేలకు, సీనియర్ సిటిజన్లకు 50 వేలనుంచి 75 వేలకు పెంచాలని కూడా కోరుతున్నారు.

లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అమ్మకాల నుంచి లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ విషయంలో పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. లక్ష వరకు ఉంది. దీన్ని…. ముఖ్యంగా  రిటెయిల్  ఇన్వెస్టర్లకు రెండు లక్షలకు పెంచాలన్న సూచన ఉంది. ఇదే సమయంలో ప్రత్యామ్న్యాయంగా  టాక్స్ రేట్ ని 5 శాతం తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చు. ఇది కేపిటల్ మార్కెట్ కి మంచి ఊపునిస్తుంది కూడా.. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణాల మీద ఆంక్షలు అమలైన కారణంగా ఉద్యోగులు  2018-2021 బ్లాక్ పీరియడ్ లో ఎల్ టీ సీ ని వినియోగించుకోలేకపోయారు. ఈ కారణంగా కేంద్రం బడ్జెట్లో ఎల్ టీ సీ క్యాష్ వోచర్ స్కీమ్ ని ప్రవేశ పెట్టడం మంచి ఫలితమిస్తుందని భావిస్తున్నారు.
Read More: ITR Filing last Date 2019-20: ఇన్‌కమ్ ట్యాక్స్ రిట్నర్ దాఖలు చేశారా? చివరి తేది ఎప్పుడంటే.
Read More:కోవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించిన కేంద్రం, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కఠినం !