ఈమె స్పర్శతో ఆ చీర నేసిన చేతులు పునీతం అయ్యాయి.. మెస్మరైజ్ అనన్య..

21 April 2025

Prudvi Battula 

Credit: Instagram

30 అక్టోబర్ 1998న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై నగరంలో జన్మించింది అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే.

ఈ వయ్యారి తండ్రి చుంకీ పాండే కూడా బాలీవుడ్ నటుడు, తల్లి భావన పాండే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆమెకు రైసా అనే చెల్లెలు ఉంది. తాత శరద్ పాండే హార్ట్ సర్జన్. మామ చిక్కి పాండే వ్యాపారవేత్త, అత్త డీన్నే పాండే వెల్నెస్ కోచ్.

ముంబైలోని ప్రముఖ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల నుంచి డిగ్రీ వరకు చదువుకుంది ఈ వయ్యారి భామ.

టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో చలన చిత్ర అరంగేట్రం చేసింది.

తర్వాత పతి పత్నీ ఔర్ వోలో కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి 1978లో వచ్చిన ది సమె నేమ్ చిత్రం రీమేక్‌లో కనిపించింది.

2020లో ఇషాన్ ఖట్టర్ సరసన యాక్షన్ చిత్రం ఖాలీ పీలీలో కథానాయకిగా నటించింది. తర్వాత 2022 గెహ్రైయాన్ లో కనిపించింది.

అదే ఏడాది విజయ్ దేవరకొండకి జోడిగా లైగర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది ఈ అందాల భామ.