ఓరీ దేవుడో  ఈ ఫేమస్ నగరాల పేర్లు రాక్షసుల పేర్లా... ఇప్పటి వరకు తెలియకపాయే!

samatha 

21 April 2025

Credit: Instagram

సాధారణంగా, మన దేశంలో, చాలా నగరాలకు దేవుళ్ళు, దేవతలు, పీర్లు, ఫకీర్లు, రాజులు, మహారాజులు ,నవాబుల పేర్లు పెట్టారు.

కానీ కొన్ని నగరాలకు రాక్షసుల పేర్లు కూడా పెట్టారని మీకు తెలుసా? ఇది చదవడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం

కానీ భారతదేశంలో  ఉన్న చాలా ఫేమస్ నగరాలకు రాక్షసుల పేర్లు పెట్టారంట. కాగా, అసలు ఏ ఏ నగరాలకు రాక్షసుల పేర్లు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ అనే ప్రసిద్ధ నగరం ఉంది. ఇది మహిషాసుర అనే రాక్షసుడి పేరుతో ముడిపడి ఉంది.

జలంధర్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ నగరం. ఇది పురాతన కాలంలో జలంధర్ జలంధర్ అనే రాక్షసుడి రాజధానిగా ఉండేదని నమ్ముతారు.

పాల్వాల్ హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ నగరం. ఈ నగరానికి పలంబసురుడు అనే రాక్షసుడి పేరు పెట్టారని నమ్ముతారు. గతంలో దీనిని పాలంబర్‌పూర్ అని పిలిచేవారు. 

తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి ఒక ప్రసిద్ధ నగరం. ఈ నగరానికి త్రిస్సారన్ అనే రాక్షసుడి పేరు పెట్టారని నమ్ముతారు. ఈ నగరం పేరు కాలక్రమేణా మారుతూ వచ్చింది.

గయ నగరం బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ నగరం. గయాసురుడు అనే రాక్షసుడి పేరు మీద గయ అనే పేరు వచ్చిందని నమ్ముతారు.