SRH vs LSG: దెబ్బ అదుర్స్ కదూ.. బ్యాటింగ్ రాదని అవమానం.. కట్ చేస్తే.. పాత జట్టును పచ్చడి చేశాడుగా
సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించిన హైదరాబాద్.. ఉప్పల్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్-2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

తొలి మ్యాచ్‌లోనే రికార్డు స్కోర్‌తో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది. ఆ తర్వాత.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. లక్నో టీమ్‌లో డేంజరస్ నికోలస్ పూరన్ 70 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 రన్స్‌తో చేలరేగి ఆడారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఇద్దరూ.. లక్నోను గెలుపు దిశగా అడుగులు వేయించారు. అయితే.. కమిన్స్.. తన వరుస ఓవర్లతో పూరన్, మార్ష్ దూకుడుకు కళ్లెం వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని, రిషబ్ పంత్ స్వల్ప స్కోర్‌కే అవుట్ కాగా.. క్రీజ్‌లోకి వచ్చిన అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్ నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను కంప్లీట్ చేశారు. ఫలితంగా.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. ఐపీఎల్ 18వ సీజన్‌లో లక్నో తొలి విక్టరీ నమోదు చేసుకుంది.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
ఇక.. అంతకుముందు.. బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే వరుస షాక్‌లు తగిలాయి. తొలి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతోపాటు.. మూడో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడంతో సన్‌రైజర్స్‌కు గట్టిదెబ్బ తగిలింది. అయితే.. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 రన్స్‌తో రాణించాడు. అలాగే.. నితీశ్‌రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26, అనికేత్‌వర్మ 36 పరుగులతో బ్యాట్ ఝళిపించగా.. సన్‌రైజర్స్ స్కోర్ 200 క్రాస్ చేయడం ఖాయం అనిపించింది. కానీ.. చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితం కావాల్సింది వచ్చింది. మొత్తంగా.. హైదరాబాద్ తొలి ఓటమిని చవిచూడగా.. లక్నో ఫస్ట్ విక్టరీని అకౌంట్‌లో వేసుకుంది.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా