Hanuman Jayanti 2025: హనుమాన్ జయంతి ఎప్పుడు? సరైన తేదీ? పూజా విధానం తెలుసుకోండి..
బజరంగ బలి హనుమంతుడు జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రాముడు, హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కనుక ఈ సంవత్సరం హనుమంతుడు జయంతిని ఎప్పుడు వచ్చింది? హనుమంతుడు ప్రాముఖ్యత, పూజా విధి గురించి తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మ దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున బజరంగబలి హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున వివిధ ప్రదేశాలలో హనుమాన్ జన్మ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడు చైత్ర మాసం పౌర్ణమి రోజున అంజనీ దేవి, కేసరి దంపతులకు జన్మించాడని నమ్మకం.
హనుమంతుడి జన్మ దినోత్సవం 2025 తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమంతుడి దినోత్సవం చైత్ర మాసం పౌర్ణమి తిధిలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమి తిధి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఉదయం 5:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు.
హనుమంతుడి జన్మ దినోత్సవం పూజ విధి
హనుమంతుడి జన్మ దినోత్సవం రోజున రామ భక్త హనుమంతుడితో పాటు సీతా రాములను పూజిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తరువాత, హనుమంతునికి ప్రసాదంగా సింధూరం, ఎర్రటి పువ్వులు, తులసి దళాలు, శనగలు, బూందీ లడ్డును సమర్పించండి. హనుమంతుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయండి. పూజ చివరలో హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచండి.
హనుమంతుడి జన్మ దినోత్సవం ప్రాముఖ్యత
హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తారు. 8 మంది అమరులలో ఒకరిగా భావిస్తారు. ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నాడని నమ్మకం. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడి జన్మదినోత్సం రోజున నియమ నిష్టలతో పూజించడం ద్వారా.. భక్తుడు హనుమంతుడి ఆశీర్వాదాలను పొందుతాడు. జీవితంలో అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజ సమయంలో హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి లడ్డులు, తులసి దళాలు, తమలపాకులను సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు