AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2025: ఉగాది రోజున ఏ టైంలో వేప పువ్వు పచ్చడి తినాలి? ఏ పనులు చేయడం శుభప్రదం.. ఏమి చేయకూడదో తెలుసా..

యుగాది అంటే సంవత్సరాది.. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం.. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025, మార్చి 30న ఉగాది పండగ జరుపుకోనున్నారు. ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడం శుభ ప్రదం.. అదే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు.

Ugadi 2025: ఉగాది రోజున ఏ టైంలో వేప పువ్వు పచ్చడి తినాలి? ఏ పనులు చేయడం శుభప్రదం.. ఏమి చేయకూడదో తెలుసా..
Ugadi 2025
Surya Kala
|

Updated on: Mar 28, 2025 | 6:56 AM

Share

ఉగాది అంటే నక్షత్ర గమనం… యుగం ప్రారంభమైన రోజు.. యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలు అవుతుంది. ఒకొక్క తెలుగు సంవత్సరాన్ని ఒకొక్క పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలు కానుంది. ఈ ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు. ఈ రోజు ఉగాది పండగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి? ఉగాది రోజున ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..

చైత్ర శుద్ధ పాడ్యమి తిధి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది. ఈ రోజున ఉగాది పండగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. అంతేకాదు ఉదయం 9 గం.నుంచి 11.30 గం. కొత్త బట్టలు ధరించి.. యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు. అంతేకాదు ఈ సముయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు పండితులు.

ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు. ఈ నేపధ్యంలో ఉగాది రోజున ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3 గం. మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అంటే

  1. ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు.. కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  2. ఉగాది రోజున తెల్లవారు జామునే అంటే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి
  3. ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేయాలి
  4. అభ్యంగ స్నానం చేయాలి. అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని కుంకుడు కాయలతో తలకు స్నానం చేయాలి.
  5. కొత్త బట్టలు మంగళకరం.. కనుక కొత్త బట్టలను ధరించాలి. నుదుట బొట్టుని పెట్టుకోవాలి.
  6. ఇంటి గుమ్మాలకు వేప కొమ్మలు, మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇంటిపై
  7. దేవుడికి పూజ చేసి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి.

ఉగాది పర్వదినాన పొరపాటున కూడా చేయకూడని పనులు

ఉగాది పండగ అంటే ఒక సెంటిమెంట్.. ఈ రోజు ఎలా గడుస్తుందో.. అదే విధంగా ఏడాది మొత్తం ఉంటుందని ఓ నమ్మకం. కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు. లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు..

  1. ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తను ఇంటి నుంచి బయటకు వేయవద్దు. ఇలా చేయడం వలన సంపద బయటకు పోతుందని నమ్మకం.
  2. ఉగాది రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవలు, వాగ్వాదాలు చేయవద్దు.
  3. అప్పుడు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు.
  4. ఉగాది రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు. మాంసాహారం తినొద్దు, మద్యం సేవించవద్దు.
  5. జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా మంచిది కాదు.
  6. ఉగాది రోజున చినిగిన దుస్తులు దరించ వద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!