Acharya Chanakya:అమ్మాయి మనసుని అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా.. చాణక్యుడి సలహా ఏమిటంటే
సృష్టిలో స్త్రీ ప్రకృతితో పోల్చారు పెద్దలు. అంతేకాదు ఒక స్త్రీ మనసుని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదని.. చాలా కష్టమని చెప్పారు. అదే విధంగా ఒక అమ్మాయి మనసులో అబ్బాయి చోటు సంపాదించడం కూడా అంతే కష్టమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అంతేకాదు.. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే అబ్బాయిలు ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి అనే విషయాలను కూడా ప్రస్తావించాడు. మరి ఈ రోజు చాణక్య తన నీతి శాస్త్రంలో అమ్మాయిల గురించి అబ్బాయిలకు ఇచ్చిన సలహాలు ఏమిటో తెలుసుకుందాం..

అమ్మాయిని మనసు గెల్చుకుని తన ప్రేమని తెలియజేయడం.. ఆ ప్రేమని అంగీకరింప జేసుకోవడం అబ్బాయికి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏ అమ్మాయి కూడా అబ్బాయి ప్రేమను అంత తేలికగా అంగీకరించదు. అందుకనే అబ్బాయిలు.. తాము ఇష్టపడిన యువతి హృదయాన్ని గెలుచుకోవడానికి రకారాకాల ఉపాయాలు చేస్తారు. కొన్నిసార్లు.. మౌనంగా ఉండి.. అమ్మాయిలు తమని ఇష్టపడేలా చేసుకుంటారు. అయితే ఆచార్య చాణక్యుడు పురుషుడు స్త్రీ హృదయాన్ని ఎలా గెలుచుకోవాలో కొన్ని చిట్కాలు ఇచ్చాడు. చాణక్యుడు చెప్పినట్లు చేస్తే ఏ అమ్మాయి అయినా తనని ఇష్టపడిన అబ్బాయిని ఇష్టపడుతుంది అనడంలో సందేహం లేదు.
ప్రశంసల వర్షం: పొగడ్తకు పడని వ్యక్తీ అంటూ ఎవరూ ఉండరు. ఇక స్త్రీల విషయాని వస్తే.. తనని అందరూ ప్రశంసించాలని కోరుకుంటుంది. తన పనులను, మాటలు, నడవడికను ప్రశంసిస్తే చాలు.. తనని ప్రశంసించే వ్యక్తి పట్ల మంచి అభిప్రాయాన్ని పెంచుకుంటుంది. అంతే కాదు తన గురించి చెడుగా మాట్లాడే వారిని అంతగా ఇష్టపడదు. కనుక మంచి ప్రశంసలతో స్త్రీ హృదయాన్ని గెలుచుకోవడం సులభం అని చాణక్యుడు చెప్పాడు.
ఎల్లప్పుడూ నవ్వుతూ: ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు నవ్వుతూ, నవ్వించే వ్యక్తులను ఇష్టపడడమే కాదు.. అటువంటి వ్యక్తుల చుట్టూ ఉండటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎప్పుడూ జోక్ చేస్తూ.. తనను నవ్వించే పురుషుల పట్ల యువతి త్వరగా ఆకర్షితురాలవుతుంది. స్త్రీలు సీరియస్ ముఖం పెట్టుకుని ఉండే పురుషుల కంటే.. నవ్వుతూ ఉండే మనుషును ఎక్కువగా ఇష్టపడతారు. సీరియస్ పురుషులను కనీసం చూడరు కూడా.
డ్రెస్సింగ్ సెన్స్ కలిగి ఉండడం: ఎవరినైనా మొదటగా చూసినప్పుడు.. ఎవరైనా మొదట గమనించేది వారు ధరించిన దుస్తులతో పాటు వారు ఉన్న తీరునే. అయితే కొంతమంది గడ్డాలు పెంచుకుంటారు., జుట్టు దువ్వరు, కనీసం ధరించే బట్టలు కూడా శుభ్రంగా ఉండవు. ఇలాంటి వ్యక్తులను స్త్రీలు పొరపాటున కూడా చూడరు. మీరు ధరించే బట్టలు ఖరీదైనవి కావాల్సిన అవసరం లేదు. అయితే ధరించే దుస్తులు శుభ్రంగా ఉండాలి. అలాంటి అబ్బాయిలంటేనే అమ్మాయిలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు.
చిన్న ఉద్యోగం అయినా చేయాల్సిందే: తండ్రి లేదా తల్లి ఎంత సంపదిస్తున్నా.. ఆస్తికి ఏకైక వరసుడైనా సరే.. అబ్బాయి ఏమి చేస్తున్నాడో అమ్మాయిలు గమనిస్తారు. వారసత్వంగా వచ్చే అస్తికంటే.. కనీసం ఒక చిన్న ఉద్యోగం ఉండాలని కోరుకుంటారు. అటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమని బాగా చూసుకునే సామర్థ్యం ఉంటుందని యువతి భావిస్తుంది. కనుక అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవాలంటే, తల్లిదండ్రుల సంపాదన మీద కాకుండా సొంతంగా కష్టపడి పనిచేయాలి.
మనసు అర్ధం చేసుకునే వ్యక్తిని: ప్రతి అమ్మాయి తనను ప్రేమించే, ఇష్టపడే వ్యక్తి తన మాట వినాలని కోరుకుంటుంది. అమ్మాయి మనసులోని భావాలను అబ్బాయి అర్థం చేసుకోవాలి. అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని ఒక అమ్మాయి త్వరగా ఆరాధిస్తుంది. తాను చెప్పే విషయాల్లో దేనికీ స్పందించకుండా మౌనంగా ఉండే వ్యక్తిని యువతి ఇష్టపడదు. చాణక్యుడు తన నీతిలో అమ్మాయి మనసుని అర్ధం చేసుకుని మంచి శ్రోతగా ఉన్న అబ్బాయిని మాత్రమే ఇష్టపడగలదని పేర్కొన్నాడు.
యువతి కుటుంబం పట్ల ప్రేమ: తనను ప్రేమించే అబ్బాయి తనను మాత్రమేకాదు తన కుటుంబాన్ని కూడా ఇష్టపడాలని కోరుకుంటుంది. తన కుటుంబాన్ని కూడా తన సొంతం ఫ్యామిలీ భావించి చూసుకునే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఏ అమ్మాయి కూడా తన ప్రియుడు తన ముందు తన తల్లిదండ్రులను విమర్శిస్తే.. ఆ విమర్శలను వినడానికి ఇష్టపడదు. కనుక యువతి కుటుంబ సభ్యుల పట్ల ఏదైనా చెడు భావాలు ఉంటే.. అబ్బాయిలు వాటిని బయటకు వ్యక్తం చేయక పోవడమే మంచిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు