Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clay Pot Use: వేసవిలో చల్లటి నీరు కోసం మట్టి కుండని ఉపయోగిస్తున్నారా.. ఎలా శుభ్రం చేయాలంటే

వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చల్ల నీరుని ఉపయోగిస్తారు. చాలా మంది నీటిని చల్లగా ఉంచడానికి ఫ్రిజ్‌ని ఉపయోగిస్తే.. కొంతమంది ఆ పాత మధురం అందుతూ ప్రిడ్జ్ కి బదులుగా కుండను ఉపయోగిస్తారు. కుండలోని చల్ల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే ఈ కుండని ఉపయోగించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తద్వారా కుండలోని నీరు శుభ్రంగా, సురక్షితంగా ఉంటుంది. అప్పుడు కుండలో నీరు తాగడం వలన ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం చూపించదు.

Clay Pot Use: వేసవిలో చల్లటి నీరు కోసం మట్టి కుండని ఉపయోగిస్తున్నారా.. ఎలా శుభ్రం చేయాలంటే
How To Use Old And New Pot
Follow us
Surya Kala

|

Updated on: Mar 28, 2025 | 8:48 AM

వేసవిలో చాలా మంది చల్లటి నీరు తాగడానికి ఇష్టపడతారు. దీని కోసం చాలా మంది ఇళ్లలో వేసవి ప్రారంభంలోనే చల్లటి నీరు కోసం రిఫ్రిజిరేటర్‌లో వాటర్ బాటిల్స్ ను పెట్టడం మొదలు పెడతారు. అయితే ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో ప్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీరుకు బదులుగా కుండలోని చల్లని నీరు త్రాగవచ్చు. కుండలో నీరు సహజంగా చల్ల బడుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల మట్టి కుండలు, మట్టి సీసాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా మంది వాడుతున్నారు. వాటిలో నిల్వ చేసిన నీటిని త్రాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే మట్టితో చేసిన కుండను, సీసాను ఉపయోగించే ముందు.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే వీటిల్లోని నీరు కూడా ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపించవచ్చు.

కుండను ఎలా శుభ్రం చేయాలంటే

కుండను ఉపయోగించే ముందు.. దానిని పూర్తిగా శుభ్రం చేయండి. మట్టితో చేసిన కుండలలో బాక్టీరియా, ధూళి పేరుకుపోతాయి. కనుక ఇవి నీటిలో కలిసి నీటిని అపరిశుభ్రంగా మార్చగలవు. కనుక కుండలో నీటిని పోయడానికి ముందు కుండ లోపల బాగా కడగాలి. దుర్వాసన లేదా ధూళి లేదని నిర్ధారించుకోవాలి. ఒకవేళ కొత్త కుండ కొంటే ముందు ఆ కుండను బాగా కడగాలి. ముందుగా వేడి నీరు పోసి.. అందులో బేకింగ్ సోడా వేయాలి. ఇపుడు ఈ నీటిని ఆ కుండలో కొంచెం సేపు ఉంచి.. తర్వాత కుండ లోపల పూర్తిగా శుభ్రం చేయాలి.

ఇవి కూడా చదవండి

కుండ పెట్టే స్థలం ఎంపిక

కుండను ఇంట్లో పెట్టుకోవడానికి కూడా సురక్షితమైన ప్రదేశాని ఎంపిక చేసుకోవాలి. కుండ సూర్యకాంతి పడని ప్రదేశంలో ఉంచండి. ఎక్కువ సూర్యకాంతి పడే ప్రదేశంలో కుండ పెడితే కుండ త్వరగా వేడెక్కుతుంది. ఇది నీటి రుచిని పాడు చేస్తుంది. అంతేకాదు నీరు చల్లబడడం తక్కువగా ఉంటుంది. అంతేకాదు కుండ కూడా త్వరగా విరిగిపోతుంది. కనుక కుండను చల్లని, గాలి వచ్చే ప్రదేశంలో ఉంచడం మంచిది.

కుండ ఎలా ఉపయోగించాలంటే

కుండ నిర్వహణ చాలా ముఖ్యం. కుండను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. కుండలో ఏదైనా పగుళ్లు వచ్చాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. కుండ పగిలిపోయినా లేదా పగుళ్లు ఏర్పడినా దానిని ఉపయోగించవద్దు ఎందుకంటే అటువంటి కుండలో నీరు బయటకు వస్తుంది లేదా నీటిలో బాక్టీరియా కలిసి నీటిని కలుషితం చేయవచ్చు.

తరచుగా నీటిని మారుస్తూ ఉండండి

కుండలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల నీటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కనుక కుండలోని నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. మీరు కనుక చల్ల చల్లని నీటి కోసం కుండను ఉపయోగిస్తే, ప్రతి రోజూ మంచినీటిని మారుస్తూ ఉండండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)