Pakistan UFO News: పాకిస్తాన్ లో ఆకాశంలో కాంతివంతమైన వస్తువు.. గ్రహాంతరవాసులంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ

యుగాల నుంచి అనంత విశ్వంలో ఎప్పుడూ మానవుల మేధస్సుకు అందని వింతలు విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అవి మానవాళికి మిస్టరీగా ఉండి సవాల్ విసురుతుంటాయి. విశ్వంలో భూమితో పాటు అనేక గ్రహాలున్నాయి.. భూమి మీద మనుషులు..

Pakistan UFO News:  పాకిస్తాన్ లో ఆకాశంలో కాంతివంతమైన వస్తువు.. గ్రహాంతరవాసులంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:06 PM

Pakistan UFO News: యుగాల నుంచి అనంత విశ్వంలో ఎప్పుడూ మానవుల మేధస్సుకు అందని వింతలు విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.  అవి మానవాళికి మిస్టరీగా ఉండి సవాల్ విసురుతుంటాయి. విశ్వంలో భూమితో పాటు అనేక గ్రహాలున్నాయి.. భూమి మీద మనుషులు నివసిస్తున్నట్లు ఇతర గ్రహాల మీద కూడా జీవులున్నాయని ఎప్పటినుంచో వాదన వినిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా గ్రహాంతర వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలేవీ లభించన్పటికీ .. యూఎఫ్ఓల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్థాన్ లో గ్రహాంతవాసుల కలకలం రేగింది. ఓ విమాన పైలెట్ ఆకాశంలో వెలిగిపోతున్న ఓ గుర్తు తెలియని వస్తువును గుర్తించాడు. ఈ విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

జనవరి 23న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ చెందిన ఓ విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలు దేరింది. విమానం ప్రయాణిస్తున్న మార్గ మధ్యంలో రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఫైలెట్లు ఆకాశంలో ఓ వింత వస్తువును గుర్తించారు. ఆకాశంలో దర్శనమిచ్చిన కాంతివంతమైన వస్తువు పైలట్ తోపాటు సాయంత్రం వేళ కావడంతో ఆ వస్తువు కిందనున్న ప్రజలకు కూడా దర్శనమిచ్చింది. దాంతో చాలామంది దాన్ని వీడియో తీశారు. ఆ గుర్తు తెలియని వస్తువు గురించి పీఐఏ పైలట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. అయితే, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కానీ, లేక మరేదైనా భారీ ఉపగ్రహం కానీ అయ్యుండొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు స్థానికులు మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు, ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్పారు. కాసేపటికి ఎర్రటి రంగులోకి మారిందని అంటున్నారు. ఆకాశంలో వేగంగా ముందుకు కదులుతూ వెళ్లిందని.. దాదాపు గంట తర్వాత మాయమైపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సాధారణ కంటికి కూడా చాలా స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.మొత్తం మీద పాక్ లో కనిపించిన ఈ కాంతి వంతమైన వస్తువు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: వేలైంటెన్స్ డేన భగ్న ప్రేమికులకు జూ అధికారుల బంపర్ ఆఫర్.. మాజీల పేర్లు ఎలుకలు, బొద్దింకలకు పెట్టుకుని..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??