డైలాగ్స్ లేవు.. ఉత్త మూకీ సినిమా.. కానీ
కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూకీ చిత్రం 'గాంధీ టాక్స్' ఒక సాహసోపేత ప్రయోగం. డబ్బు లేని జీవిత కష్టాలను, దాని ప్రాముఖ్యతను ఈ సినిమా మహాదేవ్ పాత్ర ద్వారా చూపిస్తుంది. సంభాషణలు లేకపోయినా, నటీనటుల నటన, స్క్రీన్ ప్లే, నేపథ్య సంగీతం ద్వారా కథ, సందేశం స్పష్టంగా అర్థమవుతాయి. రొటీన్ కథాంశాన్ని మూకీ రూపంలో చూపించడం ఆకట్టుకుంటుంది.
పెద్ద సౌండ్స్, భారీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటే కానీ సినిమాలని పట్టించుకోని ఇలాంటి సమయంలో మూకీ సినిమా తీయాలనుకోవడం డేరింగ్ స్టెప్పేగా.. అలాంటి సాహమే గాంధీ టాక్స్‌తో చేశాడు డైరెక్టర్ కిషోర్. సినిమాలో డైలాగ్స్ ఏమి లేవు కాబట్టి కథ అలా నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మహాదేవ్, బోస్‌మన్ కష్టాలు అన్ని చూపిస్తారు. అసలు మహాదేవ్ కష్టాలు చూస్తే వామ్మో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఇతనికే ఉన్నాయి అనే రేంజ్ లో దారుణంగా చూపిస్తారు. ఇంటర్వెల్ కి దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాక మహాదేవ్ ఏం చేస్తాడు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో దొంగతనం ఎపిసోడ్ అక్కడక్కడే తిప్పి సాగదీశారు. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటి సమాజంలో డబ్బులు లేకుండా ఏ పని నడవదు అనే విషయాన్నీ దర్శకుడు చెప్పాలనుకున్నాడు. ప్రతి నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కాబట్టి గాంధీ టాక్స్ అని టైటిల్ పెట్టాడు. సినిమాలో కూడా డబ్బులను గాంధీ అనే చెప్పించాడు డైరెక్టర్. డైలాగ్స్ లేకపోయినా ప్రతి సీన్ అర్థమయ్యేలా నటీనటులు నటించడం, దర్శకుడి స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని టెక్స్ట్ రూపంలో చూపించడంతో కథ అంతా ఈజీగానే అర్ధమవుతుంది. మనిషికి ఉన్న బాధలు, అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అనే ఎమోషన్, మెసేజ్ చెప్పారు ఈ సినిమాతో. డైరెక్టర్ రొటీన్ కథ తీసుకున్నా మూకీగా మంచి ప్రయోగమే చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్
వేతన జీవులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

