Vijay Deverakonda: 2026లో కొడితే.. డబుల్ ధమాఖానే..
విజయ్ దేవరకొండ 2026లో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "రణబలి" సెప్టెంబర్ 11న, "రౌడీ జనార్దన" డిసెంబర్‌లో విడుదల కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న "రణబలి"కి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న "రౌడీ జనార్దన"కు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు విభిన్న ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న “రణబాలి”, “రౌడీ జనార్థన” సినిమాలు ఇప్పటికే మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. విజయ్‌కు ఫ్యాన్స్ కు కూడా 2026 ఒక మెమొరబుల్ ఇయర్ కాబోతోంది. ఇక “రణబాలి”, “రౌడీ జనార్థన” సినిమాలు రెండూ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో “రణబాలి” సినిమాను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్యాషనేట్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ పై ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న తాను రూపొందిస్తున్న “రౌడీ జనార్థన” సినిమాకు బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ యంగ్ డైరెక్టర్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. “రౌడీ జనార్థన” టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కుతున్న “రణబాలి”, “రౌడీ జనార్థన” చిత్రాల్లో విజయ్ దేవరకొండ అంతే వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 11న “రణబాలి”, డిసెంబర్ లో “రౌడీ జనార్థన” సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్
నైజాం కింగ్ మెగాస్టారే.. అట్లుంటది మనోడితోని
Rajamouli: హ్యాష్ ట్యాగ్‌తో అడ్డంగా దొరికిన జక్కన్న
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

